శ్రీకాకుళం

జైలులో మావోయిస్టు నేత ఆజాద్, మరో ఐదుగురి నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, ఏప్రిల్ 8: మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు ఆలియాస్ ఆజాద్‌తోపాటు ఐదుగురు మావోయిస్టులు భువనేశ్వర్, జారపడ కారాగారంలో తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వారం రోజులుగా నిరాహారదీక్షలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆజాత్ తల్లి కాములమ్మ హరిపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆజాద్ రాసిన ఆరు డిమాండ్‌లతో కూడిన లేఖను చూపించారు. ఆంధ్రా-ఒడిశా ప్రభుత్వం మావోయిస్టుగా ముద్ర వేసి అక్రమ కేసులు బనాయిస్తోందని, కోర్టులో హాజరుపరచకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, జైలులో ఏళ్లు తరబడి విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కోర్టులో ఉద్దేశపూర్వకంగా విచారణ ప్రక్రియ జాప్యం చేస్తూ ఖైదీల హక్కులైన శీఘ్ర విచారణ, బెయిల్ పొందే హక్కును చిన్నచిన్న కారణాలు చూపుతూ నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లొంగుబాటు విధానం ప్రకారం జనజీవన స్రవంతిలోకి రావాలనే ఉద్దేశంతో ఆంధ్రా ప్రభుత్వం వద్ద లొంగిపోయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందన్నారు. ప్రభుత్వాలు, ప్రజాసంఘాల, పౌరహక్కుల నేత హరగోపాల్ జోక్యం చేసుకొని తమ కుమారుడు ఆజాద్ జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు చొరవ తీసుకోవాలని ఆమె వేడుకుంది.