శ్రీకాకుళం

థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, జూలై 10: మండలంలో చేపట్టబోవు థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న నిర్వాసితులకు నిర్భందించి సర్వే చేయడంపై సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యన్నారాయణ మూర్తి తీవ్రంగా ద్వజమెత్తారు. ఆదివారం పోలాకిలో విలేఖర్లతో మాట్లాడారు. సిఎం చంద్రబాబు అభివృద్ధి చేయడం చేతకాక పోలాకి మండలంలో ప్రజలకు పోలీస్ బలగాలతో సర్వేను అడ్డుకున్న వారికి అరెస్ట్ చేసి ప్లాంట్ నిర్మాణం ఎన్నాళ్లు చేయగలరు అని హెచ్చరించారు. రాబోలు రోజుల్లో చేయవలసిన పనులు ప్రజల సహకారం లేకుండా ఎలా చేస్తారో కబడ్ధార్ అని హెచ్చరించారు. ప్రాణత్యాగాలకైనా సిద్దపడుతున్న ప్రజలకు అధికారులు, పోలీసులు ఏమీ చేయలేరన్నారు. విద్వంసం చేయడం సరికాదని మంచి పాలన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిననాడు ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందన్నారు. రైతులకు మభ్యపెట్టి అభివృద్ది అంటూ నట్టేటముంచడానికి ముఖ్యమంత్రి పన్నాగం పడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రజలకు క్షమాపన చెప్పి థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే సోమవారనం తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీనియర్ నాయకులు చాపరసుందరలాల్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘ జిల్లా కార్యదర్శి ఎల్. శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.