శ్రీకాకుళం

పన్నుల వసూలు ఆశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 8: ఇంటి పన్నుల వసూలు గతంలో కంటే మెరుగుగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక మండల ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కోటేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ విస్తరణాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి ఫలితంగా సుమారు రూ.10కోట్ల మేరకు ఇంటి పన్నులను వసూలు చేయగలిగామని ఆయన వివరించారు. ఈ నెలాఖరకు లక్ష్యాలలో 95శాతం మేరకు పన్నులను వసూలు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు. లక్ష్యాలను అధిగమించిన కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఐదుగురు కార్యదర్శులను శాశ్వత ప్రాతిపదికన సర్వీసులను జిల్లా కలెక్టర్ క్రమబద్ధీకరించారని జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అన్ని చెరువులను విధిగా చేపల పెంపకం కోసం వేలం వేయాలని ఆయన సర్పంచ్‌లకు సూచించారు. వంద ఎకరాలలోపు విస్తీర్ణం గల చెరువులను చేపల పెంపకానికి ఇస్తే ఆయా పంచాయతీలకు ఆదాయం అధికంగా లభిస్తుందని సంబంధిత డివిజనల్ పంచాయతీ అధికారులు ఆయా ప్రాంతాలు చెరువుల విస్తీర్ణం బట్టి వేలాం పాట ఖరీదును నిర్ణయిస్తారని వివరించారు. స్థానికంగా మత్స్యకారుల సంఘాలు ఉంటే ఆయా చెరువులలో చేపల పెంపకానికి ఆయా సంఘాలకే బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండు విడత నిధులు రూ.30.30కోట్ల నిధులు విడుదలయ్యిందని ఆయన వివరించారు. అయితే, గ్రామపంచాయతీలలో ఉన్న ఒక్కో బోరుకు రూ.1000 చొప్పున మంచినీటి పథకానికి 20శాతం నిధుల చొప్పున జిల్లా పరిషత్‌కు నిర్వహణ ఖర్చుల కోసం జమ చేయాలని ఆయన స్పష్టంచేశారు. విలేఖర్ల సమావేశంలో స్థానిక పంచాయతీ విస్తరణాధికారి వెంకటరాజు పాల్గొన్నారు.