శ్రీకాకుళం

వాబలో విజృంభించిన డయేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జూలై 14: మండలంలోని అన్నుపురం పంచాయతీ వాబ గ్రామంలో డయేరియా విజృంభించి ప్రజలను వణికిస్తోంది. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు డయేరియాకు గురై తీవ్ర అనారోగ్యానికి పాలైయ్యారు. కొంతమంది విద్యార్థులు ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స పొందగా మరికొందరు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తంచేశారు. గడచిన ఆదివారం సెలవు రోజున కలుషితమైన పుట్టగొడుగులు తినడం వలన అదే రోజు నుండి వాంతులు, విరోచనాలు ప్రారంభమై గురువారంనాటిని తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర అస్వస్థతతకు గురైన దినేష్, మధు, పవిత్ర, ఉషారాణి పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన విద్యార్థులు వెంకటేష్, వసంత, రాణి, కె.సుగుణ, నందిని, చరణ్, వైష్ణవితోపాటు ఒకే ఇంటికి చెందిన లుకలాపు వెంకటేష్, చిన్నమ్మడు, నీలయ్య, శివ కూడా డయేరియా బారిన పడ్డారు. 9నెలల చంటి పాప వేదరంజనితోపాటు తల్లి అన్నపూర్ణకికూడా ఈ వ్యాధి సోకడం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం నుండి స్థానిక ఎఎన్‌ఎం తార వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వ్యాధి అదుపులోనికి రాలేదు. దీనితో క్షేత్రస్థాయి సిబ్బంది హుటాహుటిన గురువారం ఉదయం గ్రామానికి చేరుకొని ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన రోగులకు చికిత్స అందజేస్తున్నారు. వ్యాధి ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు అప్రమత్తం చేశారు. విద్యార్థులను స్థానిక వైద్యాధికారిణి విజయలక్ష్మి పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నారు.