శ్రీకాకుళం

కిడ్ని బాధితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 19: జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్ని వ్యాధులను సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్య కుటుంబు సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ను పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఇటీవలి బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్యసహాయ మంత్రిని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలుసుకుని కిడ్ని వ్యాధుల సమస్యపై తీసుకోవల్సిన అంశాలు చర్చించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పొగాకును సాగుచేసి కష్టాల్లో కూరుకుపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎం.పి, మంత్రి నిర్మలా సీతారాంను కలిసి ఇక్కడి పరిస్థితులను చర్చించారు. ప్రధాన మంత్రి మోది దృష్టికి తీసుకువెళ్లి పొగాకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆ కుటుంబాలకు ఆండగా నిలవాలన్నారు. అలాగే జిఎస్‌టి బిల్లుకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కలిసి కాసేపు మాట్లాడారు. బిహెచ్‌ఇఎల్, హెచ్‌పివిపి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి అనంత్ గంగారామ్ గీతేతో పలు సమస్యలపై చర్చించారు. ఇలా రోజంతా ఎం.పి రామ్మోహన్‌నాయుడు ప్రజా సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే పనిలో బిజీ బిజీగా గడిపారు.