శ్రీకాకుళం

‘మందులపై ఎక్సైజ్, వ్యాట్‌డ్యూటీని ఎత్తివేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 21 : ప్రజలకు నిత్యావసర, అత్యవసర మందులపై ఎక్సైజ్, వ్యాట్‌టాక్స్‌ను వెంటనే ఎత్తివేయాలని ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీవ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇ గిరి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మందుల ధరలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని, ప్రభుత్వరంగ ఫార్మా కంపెనీలను కాపాడాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా మందుల అమ్మకాలు నిలిపివేయాలని, హిందూస్తాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్‌ను మూసివేయటాన్ని విరమించుకోవాలని, తయారీ ఖర్చులకు అనుగుణంగా మందుల ధరను, తయారీలో జరుగుతున్న లోపాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వరకు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ మందుల రంగంలో జరుగుతున్న అన్యాయాలను ఇప్పటికైనా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విదేశీ కంపెనీల అధిపత్యాన్ని భారత ఫార్మా రంగంపై లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జివి కొండారెడ్డి, సంఘం నాయకులు కెవి శేషారావు, కృష్ణమోహన్, చిరంజీవి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.