శ్రీకాకుళం

అభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, జూలై 24: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కొత్తరేవు పంచాయతీలో అక్కువరం గ్రామంలో రూ.80లక్షలతో నిర్మించిన తుపాను భవనాన్ని ప్రారంభించారు. అలాగే దండులక్ష్మీపురం గ్రామంలో రూ.1.30లక్షలతో తుఫాన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈనిధులు ప్రపంచ బ్యాంకునుండి మంజూరయినట్లు తెలియజేశారు. తుఫాన్ సమయంలో తీర ప్రాంత గ్రామస్తులకు ఆశ్రయం కల్పించే విధంగా ఈ భవనాలు ఉపయోగ పడతాయన్నారు. అదే గ్రామంలో ప్రతీ మారుమూల గ్రామాల్లోనూ రోడ్ల సదుపాయం నిర్మించడానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం వెదుల్లవలస గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మిరియాపల్లి మదనమోహనరావు మృతిపట్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, జెడ్పిటీసీ గొండు రామన్న, ఎంపిపి లక్ష్మీభూషణరావు, సర్పంచ్‌లు ప్రసాదరావు, రాజేశ్వరి, పంచాయతీ రాజ్ డి ఇ రామం తదితరులు పాల్గొన్నారు.