శ్రీకాకుళం

రామపాదుకల ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 10: శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పాతశ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యం శివం సుందరం మందిరం ఆధ్వర్యంలో రామపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను, శ్రీరామపాదుకులను పల్లకిలో ఉంచి భక్తుల జయశ్రీరామ్ నినాదాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. ఉగాది ప్రారంభమైన రామోత్సవాలు ఈ నెల 16వరకు కొనసాగుతాయని, శ్రీరామనవమినాటి కల్యాణంతో ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా చైత్రశుద్ధ చవితి సందర్భంగా ఆదివారం రాత్రి పాలకొండ రోడ్డులోని విజయగణపతి దేవాలయంలో గణపతి హోమం అర్చకులు పెంటా శ్రీ్ధర్‌శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయగణపతిని స్వర్ణకిరీటంతో అలంకరించడంతోపాటు దేవాలయానికి విద్యుత్ కాంతుల శోభ అదనపు అకర్షణ అయింది. భక్తులు హోమంలోపాల్గొని విజయగణపతిని దర్శించుకున్నారు.