శ్రీకాకుళం

ముఖ్య రైళ్ళకు జిల్లాలో హాల్ట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 26: జిల్లాలోని శ్రీకాకుళం, పలాస వంటి ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ముఖ్య రైళ్లు అన్నీ నిలుపుదల చేసేలా చర్యలు తీసుకొని ఇక్కడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభును కోరారు. మంగళవారం రైల్వేమంత్రిని ఎంపి కలిసి జిల్లాలోని రైల్వే ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని స్టేషన్‌లలో సాధారణ రైళ్లు నిలుపుదల చేసి సామాన్య ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) మున్సిపాలిటీ పరిధిలో అండర్ పాసేజ్ పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించిన ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులు, చిన్నారులు ఈ రైల్వేస్టేషన్‌లోనికి వెళ్లేందుకు ప్రవేశద్వారం లేని కారణంగా నానా అవస్థలు పడుతున్నారని త్వరలో మూడు లైన్లు విస్తరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా తక్షణమే ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రైల్వేస్టేషన్‌లను అభివృద్ధి పరిచేలా వౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపి రైల్వే మంత్రిని కోరగా ఈ విషయాలన్నింటిపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిట్టు పేర్కొన్నారు.