శ్రీకాకుళం

టిడిపి నేతలు చిన్నచూపు చూస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 12: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొంది నేడు తెలుగుదేశం నేతలు బిజెపి కేడర్‌ను చిన్నచూపు చూస్తున్నారని అనేకమంది జిల్లా బిజెపి పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ముందు మొరపెట్టుకున్నారు. మంగళవారం జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం జరిగిన పార్టీ అంతర్గత సమీక్షలో జిల్లా బిజెపి నేతలంతా ఒక్కసారిగా పసుపుదళంపై ఫైర్ అయినట్టు తెలిసింది. జన్మభూమి కమిటీల పేరిట పెత్తనం చలాయిస్తూ స్థానికంగా ఉన్న బిజెపి నాయకత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పొత్తులో భాగంగా ఎటువంటి నామినేటేడ్ నియామకాల్లో కూడా పది నియోజకవర్గాల్లో ఒక్కరిని కూడా చోటు కల్పించలేదని రాష్ట్ర అధ్యక్షుడుని వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కనీసం జన్మభూమి కమిటీల్లో అవకాశం ఇవ్వకపోవడమేకాకుండా, వివిధ మార్కెట్ కమిటీ డైరక్టర్లు వంటి పదవులు కేటాయింపుల్లో బిజెపి నేతలు అధికార పార్టీకి గుర్తురాకపోవడానికి రాష్ట్ర నాయకత్వం లోటు తీవ్రంగా ఉందని కొంతమంది మండిపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పల్లకి మోయడానికే పొత్తు తప్ప, ఈ రాజకీయ వాతావరణాన్ని వదులుకోకుంటే గ్రామస్థాయిలో బిజెపి బలోపేతం కావడం కష్టసాధ్యమవుతుందని తెగేసి చెప్పినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సి.ఎస్.ఆర్. పథకం కింద 1600 రూపాయలకు అర్హులైన నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, జిల్లాకు చెందిన అధికారపార్టీ నేతలు హుకుం జారీ చేయడంతో అధికారులు అమలు చేయకపోవడం వల్ల అర్హులకు మోదీ పథకం అందకుండా పోయిందని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాట్లాడుతూ ఆ పథకం తాత్కలికంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, 2000 కోట్ల రూపాయలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు పేదలకు అందించే కార్యక్రమాన్ని రూపొందించిందని, దీనిని సక్రమంగా జిల్లాలో అమలు చేసేలా టిడిపి సర్కార్‌తో సమన్వయం చేస్తానని కార్యకర్తలకు సర్దిచెప్పినట్టు సమాచారం. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఈ నెల 14 నుంచి 24 వరకూ పంచాయతీ దివాస్ పేరిట గ్రామాల్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ఈ కార్యక్రమానికి కూడా టిడిపి నేతలు బిజెపి కేడర్‌ను ఆహ్వానించరని అటువంటి అవమానం భరించేకంటే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని పలువురు నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిసింది.
సిక్కోల్ రాజకీయాల్లో బిజెపి-టిడిపిల మధ్య పొత్తులో కత్తులు దువ్వుకుంటున్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తానంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సమీక్ష ముందు వాడిగావేడిగా ప్రారంభమైన చివరికి చల్లబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పైడి వేణుగోపాలం, జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, కిషాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, మాజీ ఎం.పి. కణితి విశ్వనాథం, నగరపార్టీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు అట్టాడ రవిబాబ్జీ, సంపతరావు నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు ఉన్నారు.