శ్రీకాకుళం

అద్దె భవనాల్లోని... సంక్షేమ వసతి గృహాలకు మంగళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 12: బడి ఈడు పిల్లలు బడిలోకి వెళ్ళేందుకు పల్లె ప్రాంతాల్లో వారి తల్లిదండ్రులకు భారం కాకుండా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి వసతిగృహం అనే పేరుతో వసతిగృహాలు ప్రారంభించారు. అయితే, నేటి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వాటిని ఎత్తివేసేందుకు సన్నద్ధమవ్వడం గమనార్హం. దశలవారీగా వీటిని రద్దుచేయాలన్న ఆలోచన ఒక్క పక్క ఉండగా కొత్తవిద్యా సంవత్సరంప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో ఈ బాలబాలికల వసతిగృహాలను రద్దుపరచాలన్న ధృడసంకల్పంతో ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తొలి విడతగా షెడ్యూల్ కులాల సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, బాల బాలికల వసతిగృహాలు అద్ద్భెవనాల్లో సాగుతున్నవి ఎన్ని, 50మంది అభ్యర్థుల కన్న తక్కువగా కొనసాగుతున్న వసతిగృహాల జాబితాను ప్రభుత్వం సంబంధిత శాఖాధికారులకు కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోగల 13 జిల్లాల్లో పై విధంగా కొనసాగుతున్న వసతిగృహాల వివరాలు సేకరించి ప్రభుత్వం తదుపరి నిర్ణయానికి పరిశీలన సాగిస్తుంది. జిల్లాలో 50మందికి తక్కువ అభ్యర్థులు ఉన్న ఎనిమిది బాలబాలికల వసతిగృహాలు, వెనుబడిన తరగతుల వసతిగృహాలు ఉన్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధనుంజయరావు గుర్తించినట్టు చెప్పారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి లావేరు షెడ్యూల్డ్ కులాల వసతిగృహం అద్ద్భెవనాల్లో కొనసాగుతుండగా వెనుకబడిన తరగతులు అద్ద్భెవనాల్లో కొనసాగుతున్నట్టు ప్రభుత్వ పరిశీలనకు నివేదిక చేరింది. పై వసతిగృహాలు రద్దయితే వీటిలో చదువులు సాగిస్తున్న బాలబాలికలను సమీపంలో గల గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, వసతిగృహ సంక్షేమ శాఖాధికారి, వెనుకబడిన తరగతులకు సంబంధించి జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖాధికారి సహాయ వెనుకబడిన సంక్షేమ శాఖాధికారి, వసతిగృహ సంక్షేమ శాఖాధికారి సత్వర చర్యలు తీసుకొని చేర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వసతిగృహ అభ్యర్థులు గురుకుల పాఠశాలల చదువులు వద్దంటే వారికి అనుకూలమైన పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేసింది.
తక్కువ అభ్యర్థులుంటే తప్పదు * డిడి ధనుంజయరావు
వసతి గృహాల్లో ఏభై మందికి తక్కువ అభ్యర్థులు ఉన్న అద్ద్భెవనాల్లో కొనసాగుతున్న ఎస్సీ, బిసి వసతిగృహాలు రానున్న విద్యాసంవత్సరం నుంచి మూసివేయక తప్పదని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ ధనుంజరావు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. వివరాలను ప్రభుత్వం తాజాగా కోరడంతో నివేదికలు పంపినట్టు తెలిపారు. వీటిని రద్దుచేస్తే వసతిగృహ అభ్యర్థుల కోరిక మేరకు తదుపరి పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయం వెలువడిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.