శ్రీకాకుళం

విజయనగరాన్ని విజయపథంలో నడిపించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 31: విజయనగరం జిల్లాను విజయపథంలో నడిపించాలని కలెక్టరుగా పదోన్నతి పొందిన వివేక్‌యాదవ్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆశీర్వదించారు. ఆదివారం ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం జెసీగా పనిచేసిన వివేక్‌యాదవ్‌కు రెవెన్యూశాఖ ఆత్మీయవిడ్కోలు పలికింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడు తూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అన్నీ జిల్లాల భాగస్వామ్యం ఉంటోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలకు తగ్గట్టుగా, ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో మెరుగైన సాంకేతికతో మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలలో సాంకేతికవిప్లవం తీసుకువచ్చిన యాదవ్ ఇదే స్ఫూర్తితో కలెక్టర్‌గా విజయనగరం జిల్లాను అభివృద్ధి పరచాలని సూచించారు. జిల్లాలో పల్స్‌సర్వేను సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం తాశీల్థారు సుధాకర్‌ను అభినందించారు. మండల ప్రత్యేక అధికారులను ప్రర్యవేక్షులుగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 29న పెద్దఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించామని, సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు మిగిలిన మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొని, కోటి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రక్రియ చేపడతామన్నారు. జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వివేక్‌యాదవ్ పదోన్నతిపై కలెక్టర్‌గా పొరుగుజిల్లాలోనే పనిచేసే అదృష్టం కలగడం ఆనందమన్నారు. అలాగే వివేక్‌యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జెసీ-2 రజనీకాంతారావు మాట్లాడుతూ భూసేకరణ చేపట్టి తోటపల్లి ప్రాజెక్టు సంవత్సరంలోనే పూర్తి చేసి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారన్నారు. పౌరసరఫరాలశాఖలో సంస్కరణలు, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం, వంశధార ప్యాకేజీ ద్వారా 421 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడంలో జెసీ వివేక్‌యాదవ్ ఎనలేని కృషి చేసారన్నారు. సన్మానగ్రహీత, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన వివేక్‌యాదవ్ మాట్లాడుతూ రెవెన్యూసిబ్బంది, జిల్లా అధికారుల సహకారంతోనే విజయవంతంగా పనులను పూర్తిచేస్తాననీ తనను సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఏటా 30 టన్నుల మాత్రమే ధాన్యం సేకరించే పరిస్థితుల నుంచి 50 టన్నులకు పెంచేందుకు చాలా కృషి చేసామన్నారు. ప్రభుత్వం ఛాలెంజ్‌గా తీసుకున్న ఇసుక పాలసీ, ఈ-పాస్ విధానం, మీసేవ వంటి అంశాల్లో జిల్లాయే ప్రధమంగా ఉండాలన్న తపనతో తన సిబ్బంది ఇచ్చిన సహకారంతో పూర్తిగా పెనుమార్పులు తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డుమా పి.డి. కూర్మనాధ్, డి.ఎస్.వో.సుబ్రహ్మణ్యం, డి.ఎం.జయరాం, ఐ.టి.డి.ఎ. పివో వెంకటరావు, శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ ఆర్డీవోలు బి.్ధయానిధి, గున్నయ్య, వెంకటేశ్వరరావు, సర్వే అండ్ లాండ్ రికార్డు ఎ.డి.కుమార్, రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ జె.రామారావు, వివిధ మండలాల తహశీల్థార్లు, ఆర్.ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.