శ్రీకాకుళం

త్వరితగతిన భూసేకరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 12: జిల్లాలో భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయసమావేశ మందిరంలో మంగళవారం ఆయన జల వనరుల ప్రాజెక్టుల భూసేకరణపై జలవనరుల శాఖ ఇంజనీర్లు, భూ సేకరణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తూ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందించాలనే ధృడసంకల్పంతో ఉందన్నారు. అయితే, వివిధ కారణాలతో పనులు జాప్యం కావడం సరికాదన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి రణస్థలం మండలం నెలివాడ, పిసిని గ్రామాల్లో భూసేకరణ పరిహారం అందజేయకపోవడంతో పనులను భూ యజమానులు అడ్డుకుంటున్నారని ఇంజనీరింగ్ అధికారులు తెలియజేయగా, సంబంధిత యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని తహశీల్దారును జెసి ఆదేశించారు. రైతులకు పరిహారం చెల్లింపులో కొద్ది మొత్తాలు మినహా దాదాపు పూర్తిగా చెల్లించామని అన్నారు. మిగిలిన మొత్తాలను త్వరలో అందుతాయని, ఆ మేరకు రైతులకు తెలియజేసి పనులకు ఆటంకం లేకుండా చూడాలని, ప్రాజెక్టుతో ప్రజలకు కలిగే ప్రయోజనం వివరించాలని కోరారు. తోటపల్లి పర్యవేక్షక ఇంజనీరు డోల తిరుమల రావు మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్‌కు లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రికి చెప్పామన్నారు. భూసేకరణ పెండింగు లేకుండా అందించగలిగితే లక్ష్యాన్ని అందుకోగలమని ఆయన తెలిపారు. సమావేశంలో డిఆర్వో బి.కృష్ణ్భారతి, టెక్కలి ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, జి.మనోరమ పాల్గొన్నారు.