శ్రీకాకుళం

సమ్మెను విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 7: కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, భీమా రంగ ఉద్యోగులు పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సమ్మె సన్నాహక కమిటీ నేతలు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆదివారం స్థానిక సిటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలపై సమర భేరీ మోగించాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం 18వేల రూపాయలుగా నిర్ణయించి, అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ వర్తింపజేయాలని, కార్మిక చట్టాలను సవరించి యజమానులకు అనుకూలంగా మార్చొద్దని కార్మికులు గొంతెత్తి చాటినా మోది, చంద్రబాబు విధానాల్లో మార్పు రానందున మళ్లీ దేశవ్యాప్త సమ్మె చేయవలసి వస్తుందన్నారు. కార్యక్రమంలో సిటు నేత కె.శ్రీనివాసు, ఎఐటియుసి నేత చిక్కాల గోవిందరావు, ఐఎఫ్‌టియు నేత ఎం.క్రాంతి, ఐయన్‌టియుసి నేత కె.వి.ఆర్.్భస్కర్ తదితరులు పాల్గొన్నారు.