శ్రీకాకుళం

సిపిసి విధానం రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 9: కంట్రిబ్యూటరీ ఫెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత ఫెన్షన్ విధానానే్న కొనసాగించాలని ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిసి విధానం రద్దుకోరుతూ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా స్థానిక ఎన్జీవో హోం నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ చేపట్టిన నిరాహారదీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ ఫెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి 15 ఏళ్లు పూర్తికాగా, ఇప్పుడిప్పుడే దాని పర్యవసానాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఉద్యోగి మృతిచెందినా, పదవీవిరమణ పొందినా సిపియస్ విధానం ద్వారా కనీస భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పిఎఫ్ వంటి సదుపాయాలు ఒక్కవేటుతో రద్దు చేశారని తెలిపారు. సామాజిక బాధ్యతగా ఫెన్షన్ చెల్లించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పుకొని ఉద్యోగులు చెల్లించే సొమ్మును సైతం కార్పొరేట్ వర్గాల వ్యాపార ప్రయోజనాలకు షేర్ మార్కెట్‌లలో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికే సిపియస్ విధానం రద్దు కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపట్టామని, అవసరమైతే దేశవ్యాప్తంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, ఆర్.వి.యన్.శర్మ, ఉపాధ్యాయ సంఘాల నేతలు గొంటి గిరిధర్, చౌదరి రవీంద్ర, ఆర్.వేణుగోపాలరావు పాల్గొన్నారు.