శ్రీకాకుళం

గ్రామ రిజిస్ట్రేషన్ భూములకు ప్రభుత్వ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఆగస్టు 9: గత ఏన్నో ఏళ్ల కిందట జరిగిన గ్రామ రిజిస్ట్రేషన్ భూములకు ఇకనుండి ప్రభుత్వం గుర్తింపునిస్తుందని విప్ రవికుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి స్టాంప్ పన్ను చెల్లించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకోవాలని విప్ రవికుమార్ తెలిపారు. ఇందుకోసం 271 జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. గతంలో ఈ భూములకు సరైన రికార్డులు లేకపోవడం వలన అర్చిదారులు పూర్తిస్థాయిలో హక్కులు కోల్పోయి సరైన ధరలకు లేక నష్టాలకు గురౌతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ జీవో ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం రద్దు చేస్తూ అడంగుల కాపీలే అన్నింటికీ ఆధారంగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఇకనుండి రైతులు భూములన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదుకాబడతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నకిలీ పాస్ పుస్తకాలు చోటుచేసుకొని సుమారు 30వేల కోట్ల రూపాయలు లావాదేవీలు సాగాయని విప్ తెలిపారు. దీనిని నివారించేందుకు 271జీవో విడుదల చేసినట్లు విప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకులు రుణాలు అందజేయాలని, మరికొంతమందికి రీషెడ్యూల్ చేయాలని విప్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రోజారాణి, ఎంఆర్‌వో తారకేశ్వరి, జెడ్‌పిటిసి ఆనెం రామకృష్ణ, ఎంపిపి సూర్యారావు, స్థానిక దేశం నాయకులు శేఖర్, విద్యాసాగర్, బోర గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

ఖైనీ స్వాధీనం
పాతపట్నం, ఆగస్టు 9: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుండి అక్రమంగా రవాణా అవుతున్న పొగా తయారీలను స్థానిక మెయిన్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నరసన్నపేటకు చెందిన దేవరశెట్టి శ్రీనివాసరావు, వీరఘట్టంకు చెందిన మెండ జగ్గారావులు సుమారు లక్ష రూ.లు విలువ చేసే ఖైనీ, గుట్కావంటి పొగాకు తయారీలను తరలిస్తుండగా పట్టుకున్నామని హెచ్‌సి నర్శింహారావు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పెరటి మొక్కలు
పంపిణీ
సారవకోట, ఆగస్టు 9: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 843మంది లబ్ధిదారులకు ఇంటి పెరడలలో పెంపకానికి మొక్కలను ఏపివో శశిభూషణరావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ పథకం కింద 2850 మొక్కలు అవసరమని నివేదిక సమర్పించగా 1100 మొక్కలను తొలి విడతగా జిల్లా అధికారులు మండలానికి పంపించారని తెలిపారు. ఇందులో 346 కొబ్బరి మొక్కలు, 300 జామి, 300 నిమ్మ, 140 మామిడి, 90 కమల మొక్కలను మంగళవారం అందజేసినట్టు ఆయన స్పష్టంచేశారు.

పూల ధరలకు రెక్కలు!
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 9: పూల ధరలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గతంలో కంటే ఈసారి పూజకు వినియోగించే పూల రకాలు కూడా ధరలు రెట్టింపయ్యాయి. శ్రావణ మాసం మరోవైపు పెళ్లిళ్లు కూడా తోడు కావడంతో వీటికి మరింత గిరాకీ పెరిగింది. కోడళ్లు పుట్టింటి నుండి మెట్టింటికి పయనమవడం, పెళ్లిచూపులు తదితర శుభకార్యాలయాలతో పూలకు గిరాకీ పెరిగింది. మూర మల్లెపూలు గతంలో రూ.30నుండి రూ.40వరకు ధర పలికేది. ప్రస్తుతం రూ.60 వరకు విక్రయిస్తున్నారు. వీటితోపాటు సంపంగి, సన్నజాజులు, ఛామంతి పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బంతిపూలు గతంలో కిలో రూ.100కు విక్రయిస్తే ప్రస్తుతం కిలో రూ.400వరకు విక్రయిస్తున్నారు. శ్రావణ శుక్రవారం ముందు రోజైతే వీటి ధరలు ఆకాశానే్న తాకుతున్నాయి.
కాలువల్లోంచి సాగునీటి సరఫరా
జలుమూరు, ఆగస్టు 9: ఈ ఏడాది వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా 2016 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వంశధార శాఖ ఇఇ వి.అప్పారావు అన్నారు. వంశధార ఎడమ కాలువ ప్రవాహాన్ని పనితీరును జలుమూరు వద్ద మంగళవారం పరిశీలించారు. కాలువ నీటి ప్రవాహం సామర్థ్యం 2400 క్యూసెక్కులు కాగా గత ఏడాది కేవలం 1600 క్యూసెక్కుల ప్రవాహం జరిగిందని దీని వలన కొన్ని ప్రాంతాలకు సాగునీరు కష్టాలు తప్పలేదని స్పష్టంచేశారు. రూ.1.30లక్షలతో కాలువలను ఆధునీకరించడం ఈ ఏడాది 2016 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని ఆయన తెలిపారు. మిగిలిన 400 క్యూసెక్కుల నీరు అందించి కాలువ సామర్థ్యం, నీటి ప్రవాహాన్ని అందించేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్టు ఇఇ స్పష్టంచేశారు. ఆయనతో సిబ్బంది ఉన్నారు.
రెండో విడత ఐసెట్ కౌనె్సలింగ్
ఎచ్చెర్ల, ఆగస్టు 9: ఈవిద్యా సంవత్సరంలో పీజీ కోర్సులైన ఎం బి ఏ , ఎం సి ఏ ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ అభ్యర్థులకు రెండో విడత కౌనె్సలింగ్‌కు స్థానిక ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. ఈ కౌనె్సలింగ్‌లో 9మంది అభ్యర్థులు వారి సర్ట్ఫికేట్లు పరిశీలించుకొని వెబ్ ఆప్షన్‌కు సిద్ధమయ్యారు. 10న కూడా కౌనె్సలింగ్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ త్రినాథరావు స్పష్టంచేశారు.