శ్రీకాకుళం

‘స్థానిక’ నేతలకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 9: పంద్రాగస్టు పండుగ ఇకపై పంచాయతీ, మండల స్థాయి రాజకీయ నాయకులకు అరుదైన గౌరవం ఇవ్వనుంది. జిల్లాలో 38 మంది జెడ్‌పిటిసిలు, 675 మంది ఎంపిటిసిలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంచాయతీ స్కూళ్ళలో, మండలాల్లో జెడ్పీ హైస్కూళ్ళలో జెడ్‌పిటిసిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అరుదైన గౌరవం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ జి.వో.నెం.1718 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడుడు యలమంచిలి బాబురాజేంద్రప్రసాద్, కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ మహాత్మగాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యంలో స్థానిక సంస్థల బలోపేతంగా ఉంటేనే వ్యవస్థకు రుగ్మతలు పట్టిపీడించవన్న మాటకు ఈరోజు సార్థకత దక్కేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది కాలంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు పంద్రాగస్టు రోజున జాతీయజెండా ఆవిష్కరించే అరుదైన అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2015 ఫిబ్రవరి నుంచి పంచాయతీరాజ్ ఛాంబర్ పంద్రాగస్టు పండుగలో వీరికి భాగస్వామ్యం కల్పించాలన్న ప్రతిపాదనను పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల పరిశీలనకు ముఖ్యమంత్రి పంపించారని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థల ప్రతినిధులు జాతీయజెండా ఆవిష్కరణ అంశంపై తర్జనభర్జన సాగించి, ఈసారి స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పంచాయతీ సర్పంచ్ జెండాను ఆవిష్కరించడంతోపాటు, పంచాయతీ, జిల్లా పరిషత్ స్కూళ్ళలో వీరు జాతీయ జెండాను అధికారికంగా ఆవిష్కరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టు కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గత రెండురోజులుగా కలెక్టర్, విద్యాశాఖాధికారి, జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీశాఖ అధికారులకు పంచాయతీరాజ్ ఛాంబర్ తరుఫున ప్రభుత్వ ఉత్తర్వుల నకలలు అందజేసి మరికొద్దిరోజుల్లో వస్తున్న పంద్రాగస్టు పండుగలో వీరికి జాతీయ జెండా ఆవిష్కరించే అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.