శ్రీకాకుళం

ప్రజల దాహార్తి తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 12: జిల్లాలో విపరీతమైన వడగాడ్పులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు యువత, స్వచ్ఛంద సేవకులు చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ట్రాఫిక్ డిఎస్పీ పి.శ్రీనివాసరావు పిలిపునిచ్చారు. మంగళవారం స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించారు. రహదారిపై ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారని, వారికి సాంత్వన చేకూర్చేందుకు అడుగడుగుకు చలివేంద్రాల ఏర్పాటు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ స్టేషన్ సిబ్బంది ముందస్తుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని, అధిక ఉష్ణోగ్రతలు తగ్గేంతవరకు ఈ చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగ, మంచినీరు అందించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు ఎన్.జగదీష్, ఎస్.సూర్యారావు, ఎఎస్సై ఎ.వి.లక్ష్మి, హెచ్‌సిలు రమణమూర్తి, అప్పన్న, వైకుంఠరావు పాల్గొన్నారు.