శ్రీకాకుళం

ప్రభుత్వ విధానాల వల్లే జూట్ సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 17: ప్రభుత్వ విధానాల ఫలితంగా సుధీర్ఘ చరిత్ర కలిగిన జూట్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మూతపడటం అన్యాయమని అఖిల పక్ష కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేసాయి. ఈ మేరకు బుధవారం రాష్టవ్య్రాప్త ఆందోళనలో బాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ మిల్లులు మూతపడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని అన్నారు. పరిశ్రమల రక్షణకోసం 1987లో వచ్చిన జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యూజింగ్ చట్టం తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నా, ప్రభుత్వం మిన్నకుండటం భావ్యం కాదన్నారు. మద్ధతు ధరలేక జనపనార పండించే రైతులు విలవిల్లాడుతున్నారని మరోపక్క చౌకగా జరుగుతున్న జూట్ ఉత్పత్తుల దిగుమతులు దేశీయ పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలను అడ్డంపెట్టుకొని యాజమాన్యాలు విశృంఖలంగా లాకౌట్‌లు విధించి కార్మికుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జూట్‌కు మద్ధతు ధర ప్రకటించడంతో పాటు లాకౌట్‌లను నిషేధించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో సిటు నాయకులు వి.జి.కె.మూర్తి, ఐఎఫ్‌టియు నాయకులు ఎన్.నీలంరాజు, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, పి.పాపారావు, ఎం.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.