శ్రీకాకుళం

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 14: మత్స్యకారులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. గురువారం రాత్రి బుడగట్లపాలేం గ్రామంలో 48 హుదూద్ పక్కా ఇళ్లకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళా వెంకటరావు మాట్లాడుతూ హుదూద్ తుఫాన్ సమయంలో నష్టపోయిన గంగపుత్రులందరికీ రాజకీయాలకు అతీతంగా వలలు, తెప్పలు, ఇంజిన్‌బోట్లకు నష్ట పరిహారం ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. అలాగే విపత్తులు ఎదుర్కొనేలా ఒక్కొ కుటుంబానికి 3.98 లక్షల రూపాయలతో హుదూద్ పథకం పేరిట ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి తీర గ్రామంలో ఈ తరహా ఇళ్లు అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. చేపల వేట గిట్టుబాటు అయ్యేలా జట్టీలు నిర్మించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కోల్డ్‌స్టోరేజ్‌లు, డ్రైఫిష్ ప్లాట్ ఫారాలు వంటి వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణంతో జిల్లాలో తీరప్రాంతం మరింత అభివృద్ధి సాధించేందుకు వీలుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి మత్స్యకారులు సాధించాలన్నారు. బుడగట్లపాలేం గ్రామానికి రహదారి నిర్మాణంలో భాగంగా 11 కోట్లతో రెండు వంతెనలు మంజూరు చేశామని త్వరలో పనులు ప్రారంభవౌతాయన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ చంద్రన్న బాట పేరిట గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనులు నిర్మాస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. తొలుత హుదూద్ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌లు శంకుస్థాపన నిర్వహించారు. ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ అల్లుపల్లి రాంబాబులు మాట్లాడుతూ మత్స్యకారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, ఎంపిడివో పంచాది రాధ, తహశీల్దాద్ బందరు వెంకటరావు, ఇవో ఆర్‌డి మోహన్‌కుమార్, హౌసింగ్ డి ఇ మోహనరావు, ఎ ఇ అప్పలనాయుడు, సర్పంచ్‌లు వారది యర్రయ్య, మూగి కొర్లయ్య, అలుపున నాగిరెడ్డి, బోర శ్రీనివాసరావు, గాలి వెంకటరెడ్డి, సాధు మల్లేసు, అనె్నపు భువనేశ్వరరావు, మెండ రాజారావు తదితరులు ఉన్నారు.