శ్రీకాకుళం

శివరామ్‌నగర్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 18: మండల పరిధిలోని శివరామ్‌నగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం చోరికి పాల్పడి బెవర రత్నాకర్‌రావు ఇంటిలో 35 తులాల బంగారం, రూ.10వేల నగదు అపహరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రత్నాకర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లారు. పెళ్లినుండి తిరిగి వచ్చేసరికి తాళాలు తెరిచి ఉండటంతో ఇంటిలో పరిశీలించిగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో చేరుకొని పరిశీలించారు. రత్నాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టపగలే ఈ చోరీ జరగడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల వారీగా పార్టీని బలోపేతం చేయండి
నరసన్నపేట, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు పేద వర్గాల వారికి అన్ని విధాల ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ముఖ్యంగా చంద్రన్న బీమా పథకాన్ని ప్రతీ కుటుంబానికి వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ పథకం పట్ల ప్రతీ ఒక్కరిలో అవగాహన కలిగినట్లయితే ప్రభుత్వానికి, పార్టీకి కూడా రుణపడి ఉంటారని ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆసుపత్రి సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, జెడ్పిటీసీ అధికార ప్రతినిధి చింతు పాపారావు, మండల ప్రజాపరిషత్ సలహాదారు శిమ్మ పాపినాయుడు, పోలాకి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు కిల్లి వేణుగోపాలరావు, శిమ్మ చంద్ర, వెలమల చంద్రభూషణరావు, సాధు చిన్నకృష్ణారావు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు
ఎమ్మెల్యే లక్ష్మీదేవి శంకుస్థాపన
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 18: నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి శంకుస్థాపన చేసారు. గురువారం ఆమె వార్డు పర్యటనలో భాగంగా 5వ వార్డు పరిధిలోని ఇల్సిపురం, పడ్డావీధి, రెల్లవీధి, అలాగే ఐదవ వార్డు పరిధిలోని కొన్నావీధి, బర్మాకాలనీల్లో ఆమె పర్యటించి పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బర్మాకాలనీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పగా, వెంటనే ఎమ్మెల్యే ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇళ్లపై నుంచి విద్యుత్ వైర్లు తొలగించాలని అన్నారు. అనంతరం ఐదవ వార్డు పరిధిలో పలు రోడ్లకు, కాలువలకు ఆమె శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జన్మభూమి కమిటీ సభ్యులు డి.వి.యస్. ప్రకాష్, గొర్లె కృష్ణారావు, బుర్రి మధు, జాక మాలతి, కోరాడ హరగోపాల్, పట్నాల అచ్చుతరావు, జాక శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.