శ్రీకాకుళం

బొరివంక కళాకారుడు రాంప్రసాద్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిటి, ఆగస్టు 21: కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ కళాకారుడు మండలంలోని బొరివంక గ్రామానికి చెందిన బల్లెడ రాంప్రసాద్(53) స్వగృహంలో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఉద్దాన ప్రాంతంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ఒడిశాలోనూ తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించి, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. గాత్రం, మృదంగం, హార్మోనియం తదితర సంగీత కళల్లోనూ, ‘్భక్త ప్రహ్లాద’ నాటకంలోని ప్రహ్లాద పాత్రలో జీవించేవారు. రాంప్రసాద్ నరసింహస్వామి భక్తుడు. దీంతోనే తన స్వగృహానికి సమీపంలో నృసింహ స్వామి దేవాలయం నిర్మించారు. అంతేకాకుండా నిత్యం ఆధ్యాత్మిక, కళా రంగాల్లోనే గడిపేవారిని అతని స్నేహితులు, సన్నిహితులు తెలిపారు. రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మృతిపై స్థానిక సర్పంచ్ బెందాళం శ్రీరాంప్రసాద్, ఉద్దానం యూత్ క్లబ్ అధ్యక్షుడు దుద్ది సతీష్, గెస్టు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బల్లెడ శంకరావులు సంతాపం వ్యక్తం చేశారు.