శ్రీకాకుళం

ఆటల ‘పండగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, ఆగస్టు 30: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపికలకు రికార్డుస్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఏటా పెరుగుకొంటూ వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఎంపికల్లో సుమారు 3,500 మంది బాలబాలికలు కొద్ది క్రీడంశాల ఎంపికలకు పాల్గొని సత్తాను ప్రదర్శించారు. తొలి రోజు అండర్-14, 17 బాలురు, బాలికల ఎంపికల్లో పాల్గొనగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్, క్రికెట్‌కు సంబంధించి ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. అలాగే హాకీ, అర్చరీ, ఫుట్‌బాల్‌కు సంబంధించి ఫైనల్ సెలక్షన్స్ నిర్వహించారు. కేవలం ఏడు క్రీడంశాలకు సంబంధించి 3,500 మంది క్రీడాకారులు పాల్గొంటే మరి రెండు రోజుల్లో కూడా మిగిలిన క్రీడంశాలకు సంబంధించి ఎందరు హాజరవుతారోనని నిర్వాహకులు భావిస్తున్నారు. జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు కొరత ఉన్నప్పటికీ, పిఇటిలు ఉన్న పాఠశాలల నుంచి ఎంతమంది వస్తే.. మిగిలిన పాఠశాలల్లో నియమాకాలు చేస్తే ఎంపిక చేయడం కూడా కష్టతరవౌతుందని క్రీడాసంఘాలు పేర్కొంటున్నారు. ఈ ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి పాల్గొని ఎంపికలు చేయడం కష్టతరవౌతుందని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడంతో సత్తా ఉన్న క్రీడాకారుడు కూడా పక్కకు నెట్టే అవకాశం ఉందని క్రీడావిశే్లషకులు భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ పద్ధతిని మార్చే యోచనలో ఉన్నప్పట్టు తెలుస్తోంది. నియోజకవర్గస్థాయి లేదా జోనల్ స్థాయిల్లో ఎంపికలు నిర్వహించి, ఫైనల్ సెలక్షన్‌ను జిల్లాస్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సదూర ప్రాంతాల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు ఎంపికలకు పాల్గొన్నప్పటికీ భోజన సదుపాయలు కొన్ని పాఠశాలలు కల్పించలేకపోయాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలే రవాణా ఖర్చులు, భోజన ఖర్చులు భరించాల్సి ఉండగా, కొద్ది పాఠశాలల మాత్రమే భరించాయి. మరికొద్ది పాఠశాలలు భోజన ఖర్చులు భరించలేక విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. ఎస్.సి శేఖర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎం.వి.రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారుడు కె.రాజారావు తదితరులు పాల్గొని పోటీలు సక్రమంగా నిర్వహించేందుకు సహకరించారు.