శ్రీకాకుళం

కమనీయం... సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 15: జగదభి రాముడు జానకి ప్రాణనాథుడయ్యాడు... సిగ్గులొలికే సీతమ్మ మెడలో అందాల రాముడు మూడు ముళ్లు వేశాడు... మణిబాసికాన్ని నుదుటన కట్టిన సీతమ్మ, సొంపుగా కస్తూరి నామాన్ని దిద్దుకున్న రామయ్య...వధూవరులుగా పెళ్లి సందడి చేశారు. లోకకల్యాణం కోసం జరిగిన సీతారామ కల్యాణాన్ని జనులంతా తిలకించి పరవశించిపోయారు.
చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామ కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ప్రధాన వేడుక పాలకొండ రోడ్‌లోని కోదండరామ దేవస్థానంలో నిర్వహించారు.
ఉదయం శ్రీరామజనన ఘట్ట పారాయణం అనంతరం 9 గంటలకు సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ ఊరేగింపుగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంపైకి తీసుకువచ్చారు. పాంచరాత్ర దివ్యాగామెక్త ప్రకారంగా స్థానాచార్యులు ఎంవి అప్పలాచార్యులు, అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు కల్యాణ క్రతువును ప్రారంభించారు.
విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పరిషత్ దక్షిణ, కలశారాధన, రక్షాసూత్రధారణ, యజ్ఞోపవీతధారణ, ప్రవర, కన్యాదానం వంటి కళ్యాణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిజిత్ లగ్న సమయంలో సుముహూర్తంలో భాగంగా జీలకర్ర, బెల్లం వధూవరుల తలపై పెట్టడంతో చూపులు కలిసిన శుభవేళ భక్తజనం గోవిందనామస్మరణ చేసింది. మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, అర్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కళ్యాణోత్సవం ముగిసింది.
కల్యాణం నిర్వహిస్తున్న సమయంలో టిపి కూర్మాచార్యులు, టిపి రామకృష్ణమాచార్యులు సీతారామ కల్యాణ వైభవాన్ని వివరిస్తూ సీతమ్మ జీవాత్మ అయితే రాముడు పరమాత్మ అని, జీవాత్మ పరమాత్మల కలయికే ‘రామకథ’ అని పేర్కొన్నారు. కల్యాణ వైభోగాన్ని తిలకించేందుకు కోదండరామాలయానికి భక్తులు పోటెత్తారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న వారికి వలంటీర్లు ప్రసాదాలు అందజేశారు. భక్తులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదం బెల్లం పానకాన్ని, పులిహోర, చక్రపొంగలి పంపిణీ చేశారు.
కోదండ రాముడ్ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం దంపతులు పాల్గొన్నారు. ఈవో సర్వేశ్వరరావు వారికి స్వాగతం పలికి మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణ వేదిక వద్దకు తోడ్కొనివచ్చారు. కలెక్టర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.