శ్రీకాకుళం

ఒకే గూటికి బద్ధ్దశత్రువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ ఎన్‌పేట, ఏప్రిల్ 15: రాజకీయంగా బద్ధశత్రువులగా ఉన్న నాయకులు ఒకే గూటికి చేరారు. శుక్రవారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సమక్షంలో దబ్బపాడు గ్రామంలో వైకాపాకు చెందిన పిర్ల సీతారాం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నాళ్లుగా దబ్బపాడు గ్రామంలో పిర్ల సీతారాం, జన్ని మోహనరావులు రాజకీయంగా వేర్వేరు పార్టీలో ఉంటూ అదిపత్య పోరు కొనసాగించే వారు. వైసీపీకి చెందిన పిర్ల సీతారాం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు మొదటి నుంచి అనుచరుడు కాగా, జన్ని మోహనరావు ప్రారంభం నుంచి తెదేపాలోనే ఉన్నారు. ప్రస్తుతం జన్ని మోహనరావు సర్పంచ్‌గా ప్రాతినిద్యం వహిస్తున్నారు. మాజీ సర్పంచ్‌గా పిర్ల సీతారాం ఉన్నారు. ఎమ్మెల్యే కలమట తెదేపాలో చేరినప్పటికీ ఇంత వరకు పిర్ల తటస్థంగా ఉండిపోయారు. ఇటీవల రాజకీయ సమీకరణాలతో తెదేపాలోకి సీతారాం రావడానికి నిర్ణయించుకుని చేరిపోయాడు. నాడు శత్రువులగా, నేడు మిత్రువులగా వీరిద్దరూ ఒక్కటై రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని నిరూపించుకున్నారు. ఐక్యమత్యంలో అభివృద్ధిని సాధించాలని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సూచించారు.
శుక్రవారం దబ్బపాడు గ్రామంలో పిర్ల సీతారాం తెదేపాలోకి చేరిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాటపట్నం నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరునకు సి ఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి సమయంలో కార్యకర్తల సమన్వయంగా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలుగు దేశంపార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శివ్వాల కిశోర్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.