శ్రీకాకుళం

ప్రేమ పేరుతో మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, ఏప్రిల్ 15: తనను ప్రేమించానంటూ మభ్యపెట్టి చివరకు మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు ప్రేమికుడి ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలంటోంది. మండలంలో పట్టులోగాం గ్రామానికి చెందిన సవర హరిశంకరరావు బోరివంక స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నప్పుడు కొంకడాపుట్టుగ పంచాయతీ కుల్లోగాం గ్రామానికి చెందిన సవర భూలక్ష్మితో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల పరిచయం చివరకు ప్రేమగా మారిందని ప్రియురాలు భూలక్ష్మి తెలిపింది. ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబరుచుకొని ఇప్పుడు నువ్వెవరివో తెలియని హరిశంకరరావు చెబుతున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇప్పుడు తను నాలుగు నెలల గర్భిణీనని, ఇటువంటి తరుణంలో తనను కాదని అనడంతో తనకెవరు దిక్కని విలపిస్తోంది. ఈ విషయమై గతనెల మార్చి 12న మందస పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగకపోవడంతో గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి జిల్లా ఎస్పీ ఖాన్‌కు ఫిర్యాదు చేసానని తెలిపింది. ఇదిలావుండగా తాను ప్రశ్నించినప్పటికీ మార్చి 29న వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని భూలక్ష్మి ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆమె నుంచి వివరాలు సేకరించారు. హరిశంకరరావు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు భూలక్ష్మి తెలిపింది. ప్రస్తుతం హరిశంకరరావు ఇంటి వద్ద శుక్రవారం బైఠాయించి ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తోంది.