శ్రీకాకుళం

విజయ గణపతికి పుష్పాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 11: నగరంలో పాలకొండ రోడ్‌లో ఉన్న విజయగణపతి ఆలయంలో అర్చకులు పెంటా శ్రీ్ధర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా విజయగణపతికి 108 రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణమంతా పుష్పాలతో అలంకరించారు. స్వామివారికి భక్తులు పూలతో అభిషేకాలు , పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా ఇలీసిపురం వద్ద వినాయకుని మండపంలో లక్షదీపారాధన గావించారు. రైతు బజార్ దరి వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం, జిటి రోడ్ లో ఉన్న వినాయకుని మండపంలో మహిళలచే కుంకుమపూజలు నిర్వహించారు.