శ్రీకాకుళం

నగరపాలక సంస్థ ఆస్తులు కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 13: నగరపాలక సంస్థ పరిధిలో అధికారుల అవినీతితో సంస్థ ఆస్తులు వ్యక్తిగత ఆస్తులుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునే క్రమంలో కొన్ని రికార్డులు అధికారులు కావాలని గల్లంతు చేస్తున్నారని, దీనిపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పి.ఎ.శోభ దృష్టిసారించాలని ఆయన కోరారు. గతంలో శాంతిభద్రతల విషయంలో రాజకీయ జోక్యంతో రౌడీయిజం పెచ్చుమీరిందని, ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాక రాజకీయ జోక్యానికి తావివ్వకుండా తనదైన శైలిలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడం సంతోషదాయకమన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధి విషయానికి వస్తే 28 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయని, వుడా నిధులు రెండు కోట్ల రూపాయలతో పిఎన్ కాలనీలో మెయిన్ రోడ్డు నిర్మాణం, అలాగే 80 అడుగుల రోడ్డు నుండి సూర్యమహల్ కూడలి వరకు 3.4 కోట్లరూపాయలు, నాగావళి తీరం అభివృద్ధికి 5.5 కోట్ల రూ.లు కేటాయించడమైందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, బస్వా రాజేష్‌రెడ్డి, గంగు నాగేశ్వరరావు, కరగాన రాము, సిరిపురం భాస్కరరావు, గొర్లె కృష్ణారావు పాల్గొన్నారు.