శ్రీకాకుళం

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, సెప్టెంబర్ 13: మండలంలోని సవరడ్డపనస గ్రామానికి సమీపంలో మంగళవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. మృతుని భార్య స్వల్పగాయాలతో బయటపడింది. జలుమూరు మండలం లింగాలవలస గ్రామానికి చెందిన పంచిరెడ్డి పుణ్యావతి ఆమె కొడుకు రమణమూర్తి, భార్య అరుణ ద్విచక్రవాహనంపై పాతపట్నం అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా సారవకోడ మండలం వడ్డినవలస గ్రామం ఇప్పిలిబాలకు చెందిన లగేజీవ్యాన్ ఢీకొట్టడంతో తల్లి పంచిరెడ్డి పుణ్యావతి(50) కొడుకు రమణమూర్తి(26) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రమణమూర్తి భార్య అరుణకు కాలు, చేతులకు స్వల్పగాయాలు కాగా చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రమణమూర్తికి అరుణతో నెలరోజుల క్రితమే వివాహమైంది. కాళ్లపారాణి ఆరకముందే కళ్లేదుటే అత్తపుణ్యావతితోపాటు భర్త రమణమూర్తి దుర్మరణం పాలు కావడం అరుణ జీర్ణించుకోలేకపోయింది. సొంత అవసరాల కోసం కలపను రవాణా చేస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎఎస్‌ఐ ఎంఆర్‌కె రావ్ స్పష్టంచేశారు. పాతపట్నం సిఐ ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పంచనామా జరిపించి పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు.