శ్రీకాకుళం

డేంజర్ బెల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వైసిపికి రాజకీయంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.అధికార పార్టీ తెలుగుదేశం వలసల ముప్పు ఓ వైపు వైసిపిని ఇప్పటికే ముప్పతిప్పలు పెడుతోంది. ఒకటి రెండు నెలల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతోనే పనిచేస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తామంటూ తెలుగుతమ్ముళ్ళు బహిరంగంగానే సవాళ్ళు చేస్తున్నారు. దీనికనుగుణంగానే వైసిపిలో బలమైన, నమ్మకమైన వారు ఇప్పటికే చాలా మంది ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. అయితే, వలసలతోపాటు ఇప్పుడు జిల్లా వైసిపి నేతల్లో నగరపాలక సంస్థ ఎన్నికల కలవరం మొదలైంది. జిల్లా అంతటా అధికార పార్టీ పాలనపై జనం అంత సంతృప్తిగా లేరంటూ ఇటీవల ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే నివేదికలు ఇచ్చారు. దీంతో నగరపాలక సంస్థ ఎన్నికలు మరికొద్ది నెలలు వాయిదా పద్ధతికి సి.ఎం. గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చారన్న చేదునిజాన్ని అధికార పార్టీ నేతలు గోప్యంగా ఉంచారు. సాధారణంగా అధికార పార్టీపై ప్రజలకు కోపం వస్తే అది ప్రతిపక్ష పార్టీలకు అనుకోని వరంగా మారుతుంది. ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు వైసిపికి సిక్కోల్ రాజకీయాల్లో ఆదరణ పెరగాలి. కానీ, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం వైసిపి కూడా జనంలో ఆదరణ అంతగా లేదని తెలుస్తోంది. అంటే వైసిపి నేతలు సరిగ్గా ప్రతిపక్షపాత్ర పోషించడంలో విఫలమైందంటూ ఇంటెలిజెన్స్‌శాఖ సర్కార్‌కు ఇచ్చే సమాచారం. జనం ఆశించిన విధంగా జిల్లా వైసిపి పనిచేయడం లేదన్నమాట. ఈ విషయం మాజీ మంత్రి, రాష్ట్ర వైసిపి ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావుకు సుస్పష్టంగా తెలుసు. కానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆ విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇక్కడ నేతలకు బాధ్యతగా పార్టీ బరువుబాధ్యతలు అప్పగించాలి. గత కొనే్నళ్ళుగా సీనియర్ నేతలు ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, పాలవలస రాజశేఖరం వంటి ఎంతోమంది రాజకీయ కురువృద్ధులతో కూలంకుషంగా జిల్లాలో పార్టీ వ్యవహారాలపై జగన్ చర్చించే సందర్భాలు చాలా తక్కువ. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి సీనియర్ నేతలను సైతం పక్కనపెట్టే నైజం ఇంకా జగన్‌లో మారలేదన్న సిక్కోల్ ప్రజల మనోభావాలు లోటస్‌పాండ్ వరకూ తెలిసినవే. ఈ సంకేతాలు చూస్తే ప్రజా సమస్యలపై వైసిపి పోరాటం జనం మెచ్చేలా లేదు. పోరాడేందుకు జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నా.. వైసిపి వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నట్టు కన్పించడం లేదు. వైసిపి ఇదే తరహాలో పనితీరు కనబరిస్తే అది ఖచ్చితంగా మూడో పక్షానికి అవకాశం ఇచ్చినట్టే..కానీ, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం మరోపక్షానికి ఛాన్స్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీయే మరల ప్రజలను పాలించేందుకు ఇక్కడ వైసిపి పరిస్థితులు అవకాశం ఇచ్చేలా కన్పిస్తోంది. ఇకనైనా వైసిపి అధ్యక్షుడు జగన్ నిరంకుశ ధోరణీ, విధివిధానాలు, తాను సి.ఎం. చేసే బాధ్యతను దేవుడుపై వేయకుండా, ప్రజాపోరాటాలపై దృష్టిపెడితే సిక్కోల్ జనం కోరుకున్న పాలకులు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారు. లేదంటే...మరికొద్ది నెలల్లో నిర్వహించనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే విజయం చేజిక్కించుకున్నా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం ఇంటెలిజెన్స్‌శాఖ నిర్వహించిన సర్వేలో అన్నీ జిల్లాలు సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి అన్న అంశాన్ని తీసుకుని ప్రజాభిప్రాయాన్ని క్రోడికరిస్తే జిల్లా జనం 54 శాతం మంది బాబు కష్టపడుతున్నా..్ఫలితాలు మాత్రం మాకు అందడం లేదన్న భావన చాలా తీవ్రంగా ఉందని సర్కార్‌కు నివేదికలు ఇచ్చారు. ప్రత్యేకించి రైతులు, యువత, అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగులపై గడచిన నిరంకుశ విధానాలు, ఒత్తిళ్లు బాబు సర్కార్‌పై అసంతృప్తి పెంచుతుందని సర్వే తేటతెల్లచేడంతో నగరపాలక సంస్థ ఎన్నికలు మరో రెండుమాసాలకు సర్కార్ పొడిగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సామర్థ్యానికి 67 శాతం మంది జిల్లా ప్రజలు ఆమోదిస్తే, అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజాపోరాటాలు సమీప కాలంలోకానీ, సుదీర్ఘకాలంలో కానీ వైకాపా చేయలేకపోయే పరిస్థితులు ఇక్కడ నేతల మధ్య సమన్వయలోపాలతో మిలితమైపోయాయంటూ 62 శాతం మంది ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు ఇంటెలిజెన్స్‌శాఖ నివేదికలలో ఉన్నట్లు బోగట్టా. ప్రత్యేకించి ప్రభుత్వ పథకాలు, హామీలు అమలు విషయాల్లో అధికార పార్టీపై చాలా వ్యతిరేకతతోపాటు జిల్లా టిడిపి ప్రజాప్రతినిధుల అవినీతి కూడా బలంగా ఆ పార్టీని బలహీనపరుస్తుందన్న సమాచారాన్ని కూడా సి.ఎం.కు ఇంటెలిజెన్స్ అధికారులు సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2024 వరకూ పక్కా ప్రణాళికతో ముఖ్యమంత్రి చేస్తున్న పనులకు తెలుగుతమ్ముళ్ళు మాత్రం అందుకు అనుగుణంగా పనిచేయడం లేదని, ప్రజావ్యతిరేకత కార్యకలాపాలతో ముందుకుసాగుతున్నారన్న నివేదికలపై ముఖ్యమంత్రి సిక్కోల్ తమ్ముళ్ళపై సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఇంతటి వ్యతిరేకత ప్రజల్లో, పార్టీలో ఉన్నా...జిల్లా వైసిపిలో మాత్రం నెలకో నాలుగు ప్రెస్‌మీట్లతో ముందుకుసాగిపోతుంటే - పదేళ్ళు పాతాళంలో ఉన్న టిడిపిని పతాకస్థాయికి ఎదిగేలా చేసింది వైసిపియే అంటూ ఇక్కడ రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.