శ్రీకాకుళం

ఫార్మశీ విద్యతో ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27: దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉండటం వలన ఫార్మశీ రంగం అభివృద్ధి చెందుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఫార్మశీ ప్రొఫెసర్ జయంతివిజయరత్న తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫార్మశీ కళాశాలలో మంగళవారం ఫార్మశీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జయంతి విజయరత్న మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఫార్మశీ ఒకటని ఈ విద్యను అభ్యసించిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందటం మరింత సులువవుతుందన్నారు. విదేశాల్లో ఫార్మశీ పూర్తిచేసిన అభ్యర్థులు నెలకు రూ.1.60లక్షల వేతనం అందిపుచ్చుకుంటున్నారని ఆమె గుర్తు చేశారు. ఫార్మశీ కోర్సుల వలన సమాజసేవ చేసేందుకు అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ బుడుమూరు శ్రీరామమూర్తి, శంకరరావు, మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.