శ్రీకాకుళం

నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 27: నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకొని పదిమందికి ఉపాధి కల్పించుకునే దిశగా ఎదగడానికి కృషి చేయాలని కాపుకార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాల్‌రాయుడు తెలిపారు. మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాదయాత్ర ద్వారా కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆలోచన చేశారని సమస్యను సామాజిక కోనంలో వెనుకబాటు తనాన్ని గమనించారని తెలిపారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి ఆలోచన ఫలితమే కాపుకార్పొరేషన్ ఆవిర్భావానికి కారణమన్నారు.
పైసా పెట్టుబడి లేకుండా కేవలం శ్రమశక్తితోనే లక్షాధికారులుగా ఎదిగే పథకాలను కాపు కార్పొరేషన్ అందిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకోసం ఎంఎస్‌ఎంఇ గ్రూప్ కార్యక్రమం, స్వయం ఉపాధి పథకం ద్వారా లక్ష రూపాయల సబ్సిడీతో లాభదాయక వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించి జీవనోపాధి మెరుగుపరుచుకోవడం, ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరుచు నిమిత్తం నైపుణ్య అభివృద్ధి పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి సాధించాలన్నారు. జిల్లా కోపరేటివ్ కేంద్ర సహకార బ్యాంకు సిఇవో వి.సత్యనారాయణ మాట్లాడుతూ రుణాలను తిరిగి చెల్లించి తిరిగి రుణాలను పొందాలన్నారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రుణాలను సద్వినియోగం చేసుకున్ననాడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంస్థ, కాపు కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీహరి, కాపు కార్పొరేషన్ నాయకులు అజిత్‌కుమార్, చిన్న మాహాలక్ష్మి, శిక్షణ భాగస్వామ్యులు సింక్రో గ్లోబల్ సొల్యూషన్స్, మల్టీమీడియా పవన్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన కాపుసామాజికవర్గం ప్రతినిధులు పాల్గొన్నారు.