శ్రీకాకుళం

రోడ్లు, కాలువల నిర్మాణానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 29: నగరంలోని పలు వార్డుల్లో రోడ్లు, కాలువలు పూర్తిస్థాయి నిర్మాణానికి తనవంతు కృషిచేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి పేర్కొన్నారు. గురువారం ఆమె 36వ వార్డు పరిధిలోని ఫాజుల్‌బేగ్‌పేట, కోమటి వీధి, దేవాంగుల వీధి, సీపాన వీధుల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో నేటికీ కొన్ని వార్డుల్లో రోడ్డు సదుపాయం లేకపోవడం విచారకరమన్నారు.
తాను నగర అభివృద్ధికై వార్డులు పరిశీలిస్తుంటే పదేళ్లు అధికారంలో ఉన్న నేతలు ఏం చేసారా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వీధికి సిసి రోడ్డు వేయిస్తామని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక రోడ్లు, కాలువలు నిర్మాణానికి కృషిచేస్తున్నామని ఆమెచెప్పారు. ప్రజలు తమ సమస్యలు వివరిస్తే తక్షణమే పరిష్కరించేలా అధికారులను అప్రమత్తం చేశామని ఆమె అన్నారు. ఆమెతో పాటు వార్డు పర్యటనలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, శిల్లా శ్రీనివాసరావు, జామి భీమశంకరరావు, సీపాన మల్లేశ్వరరావు, కరగాన భాస్కర్, కరగాన రాము, మడ్డి అప్పలరాజు, నగరపాలక సంస్థ ఎంఈ జి.వెంకటేశ్వరరావు, ఏఈ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏఈ రమణమూర్తి పాల్గొన్నారు.
అలరించిన విజయముద్రిక
హరికథా సప్తాహం
శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 29: స్థానిక బాపూజీ కళామందిరంలో మిత్ర సాంస్కృతిక సమితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరికథా సప్తాహం అయిదో రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుపతికి చెందిన మధురగాయిని వి.శ్రీవాణిచే విజయముద్రిక హరికథాసప్తాహం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న దివంగత గాయకుడు ఘంటసాల మిత్రుడు కనకం ముఖలింగం మాట్లాడుతూ ఆదిభట్ల నారాయణదాస్, ఘంటసాల ఎవరికి వారే కళానైపుణ్యాల్లో గొప్పతనం చూపించేవారని గుర్తు చేశారు. తాను ఘంటసాల మిత్రునిగా ఎన్నో చూశానన్నారు. ఘంటసాల స్వరం తెలుగజాతికి ఒక వరం లాంటిదన్నారు. నిక్కు అప్పన్న, వైశ్యరాజు చంద్రవౌళిరాజు, వర్శిటీ రిజిస్ట్రార్ తులసీరావు, పులఖంఢం శ్రీనివాసరావు, ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయినీ శ్రీవాణిని, కనకం ముఖలింగాన్ని మిత్రా సాంస్కృతిక సమితీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.