శ్రీకాకుళం

స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో పికిటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 17: పాఠశాలల, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (్ఫ్యప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి మూల్యాంకనం కేంద్రం వద్ద పికిటింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి స్పాట్ దిగ్బంధనం చేశారు. సుమారు మూడు గంటలపాటు స్పాట్ కేంద్రం వద్ద రెండువేల మంది ఉపాధ్యాయులు, పోలీస్ వలయం వద్ద నినాదాలతో హోరెత్తించడం జరిగింది. భాషాపండితులు, పిఇటి పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్‌లు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సి పి ఎస్ విధానం రద్దు చేయాలని మున్సిపల్, ఎయిడెడ్, గిరిజన సంక్షేమ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని 2014 డీ ఎస్సీ నియామకాలు పూర్తిచేయాలని, హామీ పత్రాల టీచర్లకు పిఆర్‌సిలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలను చట్టబద్ధం చేయాలని, ఎంఇవో, డిప్యూటీ ఇవో పోస్టులను భర్తీచేయాలని స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు అర్థజీతం సెలవును నగదుగా మార్చుకునే సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు, సమస్యల పరిష్కారంలో జాప్యంజరిగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఫ్యాప్టో నాయకత్వం హెచ్చరించింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో జిల్లా ఇంచార్జ్ సింహాచలం హాజరై మాట్లాడారు. పికిటింగ్ కార్యక్రమానికి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, ఏబిటి ఎఫ్(1938) రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌విఇ రమణ, డిటిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట ధర్మారావు, ఎల్ ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు బి.్ధనుంజయరావు, ఎస్సీ, ఎస్టీ యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సింహాచలం, ఉపాధ్యక్షులు ఎస్.ప్రసాదరావు, వివిధ సంఘాల జిల్లా నాయకులు కొప్పల భానుమూర్తి, చౌదరి రవీంద్ర, రెడ్డి మోహనరావు,పేడాడ ప్రభాకరరావు, దాలినాయుడు, బలరాంకృష్ణ, ఏ.రామారావు, పోలినాయుడు, సాంబమూర్తి, అచ్యుతరావు, చలపతిరావు, మురళీబాబు, అప్పలరాజు, మల్లేశ్వరరావు, పద్మావతి, సత్యన్నారాయణ, గణపతి, వాగ్దేవి, కిషోర్‌తదితరులు పాల్గొన్నారు.