శ్రీకాకుళం

విరివిగా ఆర్థిక అక్షరాస్యత శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 30: ప్రజల్లో బ్యాంకు సేవలపై అవగాహన పెంపొందించేందుకు ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను నిర్వహించాలని జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 18న సీతంపేట, 20న పలాస, 21న సరుబుజ్జిలి, 25న పాతపట్నంలలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు హాజరయ్యారు. రైతులకు రుణాలను సరళంగా అందించడంలో బ్యాంకులు చొరవచూపాలని బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ రుణాలను అందించడంలో కొల్లివలస బ్రాంచ్ మేనేజర్ సమస్యలు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. పిఎం ఫసల్ బీమా యోజన ప్రీమియం రెండు శాతంగా పేర్కొంటున్నారని అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు శాతం చొప్పున చెల్లిస్తున్నాయని మొత్తం 10శాతం ప్రీమియం అవుతుందన్నారు. ఆర్థిక సహాయక యూనిట్లకు బ్యాంకులు ముందుకు వచ్చి రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్ధానాల మేరకు రూ.50వేల వరకు రుణాన్ని ఒకేసారి మాఫీ చేశామన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలేదని ఆయన పేర్కొన్నారు.
జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకు రుణాలు అందించడం లేదన్నారు. ఎంపి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ పాల ఉత్పాదనకు మాత్రమే కాకుండా ఇతర జంతువులకు అందించాలన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ కౌలు రైతులకు రుణాలందించాలన్నారు. వ్యవసాయాధికారి జారీ చేసే కల్టివేషన్ సర్ట్ఫికేట్ మేరకు రుణాలు జారీ చేయవచ్చునన్నారు. జిల్లాలో 5వేల జనాభాకు ఓ బ్యాంకు బ్రాంచ్ ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఈ మేరకు బ్యాంకు మ్యాప్ తయారు చేయాలని సూచించారు. స్వయంసహాయక సంఘాలు బృం దంగా కార్యకలాపాలను చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రతీ కుటుంబం కనీసం రూ.10వేలు నెలసరి ఆదాయం ఉండాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ పిఏ శోభ, ఆంధ్రాబ్యాంకు బిజిఎం రాధాకృష్ణారావు, ఆర్‌బిఐ ఏ జిఎం బాలసుబ్రహ్మణ్యం, ఐటిడిఏ పివో జె.వెంకటరావు, డిఆర్‌డిఏ పిడి జి.సి.కిషోర్‌కుమార్, డుమా పీడి ఆర్.కూర్మనాథ్, ఎల్‌డిఎం పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.