శ్రీకాకుళం

కసరత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 16: తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీగా ఎదిగేందుకు 2014-16 కాలపరిమితిలో రాష్ట్రంలో 55 లక్షల సభ్యత్వాలు నమోదు చేసేందుకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ చేసిన కృషి తెలిసిందే. అందులో శ్రీకాకుళం జిల్లా వాటా 2.55 లక్షల సభ్యత్వాలు. 35000 సభ్యత్వాలతో ఎచ్చెర్ల నియోజకవర్గం తొలి స్థానంలో ఉండగా, 32000 సభ్యత్వాలతో రెండోస్థానంలో పలాస నియోజకవర్గం నిలిచింది. మిగిలిన శాసనసభ నియోజకవర్గాలన్నీ 20000 - 23000 మధ్యలో సభ్యత్వ నమోదు చేసిన లెక్కలు తెలిసినవే! కానీ 2016-18 కాలపరిమితికి నాలుగున్నర లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలన్న లక్ష్యంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిపై ఆదివారం ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన టిడీపీ సర్వసభ్య సమావేశం కసరత్తు ఆరంభించింది. జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పొ లిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శ్యాంసుందరశివాజీ, గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి , జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బోయిన గోవిందరాజులు పలు అంశాలపై సమీక్షించి అనేక తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 2, నుంచి ప్రారంభించడంతో 2014-16 పరిమిత కాలానికి నమోదు చేసిన సభ్యత్వాలు కంటే రెట్టింపుగా 2016-18 సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండాలంటూ పార్టీ నేతలు తీర్మానించారు. గత సారి కంటే ఈ దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమం పది నియోజకవర్గాల్లో పోటాపోటీగా నిర్వహించాలంటూ శిరిషా పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న గ్రాడ్యూయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇందులో పార్టీ శ్రేణులను భాగస్వామ్యులను చేయాలని తీర్మానించారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలుపెంచుకునేలా ఇప్పటి నుంచే కృషిచేయాలన్నారు. అలాగే ప్రజా రాజధాని అమరావతిలో వెలగపూడి నూతన కార్యాలయ తాత్కాలిక సచివాలయ ఛాంబర్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండోవిడత డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేకూర్పు పథకానికి సంబంధించిన తొలి సంతకం చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కృషిచేసిన ముఖ్యమంత్రికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు తీర్మానించారు. అలాగే, చేనేత కార్మికులకు దీపావళి కానుకగా రెండోవిడత రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ 1100 మంది చేనేతకార్మికులకు ఈ సాయం అందిస్తున్న తెలుగుదేశం పార్టీ పనితీరుపై ప్రచారం పూర్తిస్థాయిలో జరగాలంటూ తీర్మానించారు. నవంబర్ 1 నుంచి ఆరంభించే జనచైతన్య యాత్రలు గ్రామాల వారీగా నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసి ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షమైన వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపి రాజధాని అమరావతిలో వెలగపూడి నూతన తాత్కాలిక సచివాలయం ప్రారంభం చేసిన చంద్రబాబుకు జిల్లా పార్టీ తరపున ధన్యవాధాలు తెలియజేశారు. విజయవాడలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు జిల్లా పార్టీ అధ్యక్షులతో వర్క్‌షాప్ విజయవంతం అయినందుకు ఈ సందర్భంగా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన కార్మికశాఖ కార్యాలయాన్ని ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసి, కొత్త రాజధాని నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయనకు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

చేనేతకు చేయూత
సభ్యత్వ నమోదు లక్ష్యం 4.5 లక్షలు
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
టిడిపి జిల్లా సమన్వయ కమిటీ తీర్మానం

శ్రీకాకుళం, అక్టోబర్ 16: చేనేత కార్మికులకు రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేసినట్లు చేనేత జౌళిశాఖ కార్యదర్శి, కమిషనర్ ఐ శ్రీనివాస్, శ్రీనరేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 1100 మంది చేనేత కార్మికులకు వర్తింపచేస్తూ రుణమాఫీ కార్యక్రమం నిర్వహిస్తుండగా, తొలి విడతలో రూ. కోటి 20 లక్షల రూపాయలు అర్హులైన లబ్దిదారులకు అందజేసిన విషయం తెలిసిందే. రెండోవిడతగా దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 80 లక్షల రూపాయలు రుణమాఫీ కింద లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో నిధులు విడుదల చేసినట్లు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉత్తర్వులు పాక్స్‌లో పంపారు. ఈ మేరకు లబ్దిదారులకు రుణమాఫీ అందకపోయినా, ఏమైనా సందేహాలు కలిగినా చేనేత జౌళిశాఖ ఎడి8008705681 మొబైల్‌కు ఫోన్ చేస్తే వివరాలు అందిస్తారని రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 110.96 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషనర్ తెలిపారు. మొత్తం 23,898 దరఖాస్తులకు అర్హులైన వారికి 75.99 కోట్ల రూపాయలు మాఫీ కావాల్సివస్తుందన్నారు. ఇందులో తొలివిడతలో 60 శాతం ఆన్‌లైన్‌లోజమ చేసామని, మిగిలిన 40 శాతం మొత్తాన్ని వారం రోజుల్లోగా జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 1100 మంది లబ్దిదారులకు రెండు కోట్లు రుణమాఫీ జరగాల్సి ఉండగా, తొలివిడతలో రూ. 1.20 కోట్లు, రెండోవిడతగా దీపావళి పండుగ థమాకా రూ. 80 లక్షలు వారం రోజుల్లో జమచేస్తామని జిల్లా చేనేత ఔళిశాఖ సహాయ సంచాలకులు జి.రాజారావు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు.
మహిళ హత్య!
ఎచ్చెర్ల, ఆక్టోబర్ 16: మండలంలోని అజ్జారాం పంచాయతీ పరిధిలో ఉన్న దారపువానిపేట గ్రామానికి చెందిన బోర రాములమ్మ (45) జీడి తోటలో హత్యకు గురైన దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలికి పదేళ్ల కిందట కొయ్యాం గ్రామానికి చెందిన బస గురినాయుడుతో వివాహమయ్యింది. వీరికి సంతోష్, రమణ అనే కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాములమ్మ దారపువానిపేటలో కన్నవారింటిలో నివాసముంటూ కొబ్బరి చీపుర్లు అమ్ముతూ జీవిస్తుండేది. జీడి తోటల్లోని కొబ్బరి పుల్లలు సేకరించేందుకు శుక్రవారం వెళ్లిన రాములమ్మ తిరిగి ఇంటికి రాలేదు. తండ్రి ఎర్రయ్య, బంధువులు సమీప గ్రామాల్లో వాకబు చేసినా ఆమె జాడ తెలియరాలేదు. ఆదివారం ఉదయం కొయ్యాంలోని తోటల మీదుగా ఆదే గ్రామానికి చెందిన దారపు వసంతరావు వస్తుండగా రాములమ్మ శవం కనిపించడంతో స్థానిక పెద్దలకు ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై సందీప్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. దసరా కావడం వలన సుమారు మూడు తులాలు బంగారు ఆభరణాలు వేసుకుని కొబ్బరి పుల్లలు సేకరించేందుకు వెళ్లిన రాములమ్మను దుండగులు హత్యచేసి వాటిని అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జె ఆర్‌పురం సిఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ అసుపత్రికి తరలించారు.

జిల్లా అభివృద్ధి ఇక వేగవంతం
* మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం, అక్టోబర్ 16: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ ప్రాజెక్టులను కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిత్వ క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం అచ్చెన్న ప్రారంభించారు. ఈసందర్భంగా వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలుసుకొని స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, పాలకొండ, వంగర జెడ్పిటీసీ సభ్యులు సామంతుల దామోదరరావు, బొత్స వాసునాయుడులతోపాటు పలువురు హాజరయ్యారు. (మిగతా 2వ పేజీలో)
ఈ సందర్భంగా ‘ఆంధ్రభూమి’తో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ అమరావతి నుంచి పరిపాలన వేగవంతమవడమే కాకుండా జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి లక్ష్యాలు అధిగమించేందుకు వీలుంటుందన్నారు. ట్రిపుల్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించుకోవడం , భావనపాడు పోర్టుకు టెండర్లు ఖరారు కావడం జిల్లా అభివృద్ధికి ఓ శుభపరిణామమన్నారు. కొవ్వాడలో అణుపార్కు, వంశదార నిర్వాసితులకు రూ.425 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లాప్రజలు ఎంతో రుణ పడి ఉంటారన్నారు. ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అందించడమే కాకుండా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ శిక్షణా కార్యక్రమాలు విరివిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. పారదర్శకమైన పాలన అందిస్తూ అవినీతి నిర్మూలనకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి అచ్చెన్న వివరించారు.
సంస్కృతిని కాపాడుకోవాలి
శ్రీకాకుళం (కల్చరల్), ఆక్టోబర్ 16: తరతరాల సంగీత సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం యువతపై ఉందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక బాపూజీ కళా మందిరంలో ఆదివారం సంగీత కళాకారుడు బంకుపల్లి దుర్గాశ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ కచ్చపి కళాక్షేత్రం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపి మాట్లాడుతూ యువకుడైన బంకుపల్లి శ్రీనివాసరావు కళాక్షేత్రం పేరుతో సంగీతాన్ని పూర్వవైభవం తీసుకురావడాన్ని ఎంతో అభినందనీయమన్నారు. జిల్లాలో ప్రియాగ్రహారంలో ఉన్న ప్రముఖ సంగీత సాహిత్య వేత్తలు పినాకిని, గరిమెల్ల సత్యన్నారాయణ స్వగృహాలను సాహిత్య మ్యూజియం కేంద్రాలుగా పెట్టేందుకు నిర్ణయించామని, దానికి కృషిచేస్తానని అన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ శ్రీకాకుళంలో మునుపెన్నడూ లేనివిధంగా సంగీత సాహిత్య కార్యక్రమాలు చక్కగా జరగడం ప్రపంచస్థాయిలో శ్రీకాకుళానికి మంచి పేరు తెస్తున్నాయని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఇంటాక్ అధ్యక్షుడు దూసి ధర్మారావు, సంగీత విద్యాంసులు బండారు చిట్టిబాబు, కవి కుప్పిలి రాజారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కచ్చపి సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు శర్మను, మృదంగ కళాకారులను ఎం.పి చేతుల మీదుగా సన్మానించారు. అలాగే మావుడూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శాక్సోఫోన్ ద్వయం గాత్ర కచేరి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

కవులకు వ్యాసుడు ఆదర్శం
శ్రీకాకుళం (కల్చరల్), అక్టోబర్ 16: రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి గొప్ప సాహిత్య విలువల గల వ్యక్తి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో వాల్మీకి మహర్షి జయంత్యుత్సవం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత రచయితలు, కవులు వాల్మీకి లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ మానవుడికి నైతిక విలువలు అందించే రామాయణాన్ని అందించడం గొప్ప విశేషమన్నారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ దేశానికి వాల్మీకి వంటి మహర్షులు రామాయణం, భారతం, భాగవతం వంటి సాహిత్య సంపదను అందించగలిగారని కాని నేడు విలువలు కోల్పోయి మానవులు జీవిస్తున్నారని దానికి కారణం టి.విలు, సీరియల్స్, సెల్‌ఫోన్స్ లాంటి వల్ల అసూయ ధ్వేషాలు కలుగుతున్నాయని అలా కాకుండా మహానుభావులను ఆదర్శంగా తీసుకొని వారి రచనలను చదివితే మానవత విలువలు పెంపొందించుకోవచ్చునన్నారు. అనంతరం గజల్ గాయకుడు ప్రధాన ఆదినారాయణ వాల్మీకి మహర్షిపై గేయాన్ని ఆలపించారు. ప్రముఖ నృత్య కళాకారిణి నీరజా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శిష్యబృందం చేసిన నృత్యాలు అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమాధికారి కెఎస్ ధనుంజయరావు, శిష్టకరణ సంఘ అధ్యక్షులు పోలిమహంతి ఉమామహేశ్వరరావు, హరిబాబు, ప్రసాదరావు, హరనాధ్, మల్లిబాబు, ధనరాజు, వెంకన్న, ఎం.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
బలగ, ఆక్టోబర్ 16: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఉత్సాహంగా ఆదివారం జరిగాయి. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి నాలుగు వందల మంది బాల, బాలికలు పాల్గొన్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలు ఇటువంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.విజయకుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, అథ్లెటిక్స్ శిక్షకుడు బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. అథ్లెటిక్స్‌లోని అండర్-14, 16, 18, 20 బాలబాలికలకు వేర్వేరుగా ఎంపికలు నిర్వహించి జట్టును సిద్ధం చేస్తున్నారు. ఇందులో వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందలు, 800, లాంగ్ రన్స్, జావెలిన్, షాట్‌పుట్, డిస్క్‌త్రో, హైజంప్, లాంగ్‌జంప్ తదితర క్రీడంశాల్లో ఈ ఎంపికలు జరిగాయి. గతంలో వచ్చిన రికార్డులను దృష్టిలో పెట్టుకుని జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నారు. సదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, భోజన సదుపాయలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26వ తేదీ నుంచి రాష్టస్థ్రాయి పోటీలు విశాఖపట్నంలో నిర్వహించాల్సి ఉండగా, వాటిని నవంబర్ నాల్గవ తేదీకు వాయిదా పడినట్లు నిర్వాహకులు తెలియజేశారు. వాయిదాను దృష్టిలో పెట్టుకుని క్రీడాకారులను మరింత పదును పెట్టే పనిలో ఉన్నారు.
ఏడిళ్లు దగ్ధం
ఎచ్చెర్ల, ఆక్టోబర్ 16: మండలంలోని డి.మత్స్యలేశం పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్తదిబ్బల పాలెంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. తొలుత మైలిపిల్లి లక్ష్మమ్మ ఇంటిలో ఎగిసిపడిన మంటలు ఒకే ఉదుటున సమీపంలో ఉన్న కారమ్మ, తులసమ్మ, నర్సమ్మ, అప్పారావు, లక్ష్ముమ్మ, కొర్లమ్మ ఇళ్లకు అగ్నికీలలు వ్యాప్తించి కాలి బూడిదయ్యాయి. స్థానికులు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆదుపుచేయడంతో మరింత ముప్పు తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. దుస్తులు, తిండి గింజలు, వంట పాత్రలు కాలి బూడిద కావడంతో బాధిత కుటుంబాలు లబోదిబో మంటున్నాయి. అగ్ని బాధిత కుటుంబాలను స్థానిక సర్పంచ్ మూగి మంగమ్మ, కొర్లయ్య, ఎంపిటిసి మూగి శ్రీరాములు పరామర్శించి భోజన ఏర్పాట్లు చేశారు. ఐఎవై ఇళ్లు మంజూరు చేసి బాధితుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.