శ్రీకాకుళం

శివునికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం కల్చరల్, అక్టోబర్ 17: నగరంలో పలు శివాలయాల్లో ఈశ్వరాభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా నాగావళి నది ఒడ్డున ఉన్న కోటేశ్వరాలయంలో సోమవారం ప్రధాన అర్చకుడు ఏ.రాంజీశర్మ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. పుష్పాభిషేకం, నిత్యపూజలు నిర్వహించారు. అదేవిధంగా బలగ శివాలయంలో పాలకొండరోడ్డులో నున్న ఉమానీలకంఠేశ్వరాలయం, కొన్నావీధి శివాలయంలో, బొందిలీపురం, శివబాలాజీ ఆలయంలోనున్న స్ఫటిక శివలింగానికి ఘనంగా పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు.

పారాలీగల్ వలంటీర్లకు
సామాజిక స్పృహ అవసరం
పాతశ్రీకాకుళం, అక్టోబర్ 17: పారాలీగల్ వలంటీర్లు సామాజిక స్పృహ కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలగీతాంబ అన్నారు. జిల్లాకోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పారాలీగల్ వలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చాలావరకు గ్రామీణులకు చట్టాలపై అవగాహన ఉండదని, ఆ కారణంగా వారు పలు సందర్భాల్లో మోసానికి గురవుతున్నారన్నారు. మహిళలు, యువతులు వంచనలకు గురయ్యి మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతున్నారని ఆమె అన్నారు. కేవలం వారి రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలను ప్రవేశపెట్టిందనే అవగాహన లేకపోవడమే కారణమన్నారు. పారాలీగల్ వాలంటీర్లు చట్టాలపై అవగాహన కల్పించుకొని తమ గ్రామాల ప్రజలకు న్యాయసహాయం అందించాలన్నారు. మూడు రోజులపాటు ఇవ్వనున్న ఈ శిక్షణను పారాలీగల్ వాలంటీర్లు ఉపయోగించుకోవాలన్నారు. మొదటిరోజు శిక్షణలో భాగంగా మానవ అక్రమరవాణా, మోటార్‌వెహికల్ యాక్సిడెంట్లు, న్యాయసహాయం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మేరీ గ్రేసీ కుమారి, శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి ఇంతియాజ్ అహ్మద్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

పట్ట్భద్రుల
ఓటరు దరఖాస్తుల కొరత
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: ఎం.ఎల్.సి ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఓటరునమోదుపై అధికారులు దృష్టిసారించారు. నవంబర్ 5 లోగా పట్ట్భద్రులు ఎం.ఎల్.సి ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకోనేందుకు చివరితేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటి బాధ్యతలను తహశీల్దార్, ఎం.పి.డి.ఓలకు అప్పగించింది. అయితే, దరఖాస్తులు మాత్రం అవసరానికి అనుగుణంగా కేటాయించకపోవడంతో అటు అధికారులకు ఇటు అర్జీదారులకు అవస్థలు తప్పడంలేదు. ఫారం 18 నాలుగు పేజీలు ఉండడంవల్ల సంబంధిత అధికారులు నమూనా ఇచ్చి జిరాక్సు ప్రతులు తీసుకోవాలని అర్జీదారులపై భారం మోపుతున్నారు. ఇప్పటికే అనేకమంది ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు చేసుకొన్నా నిబంధనలకు అనుగుణంగా పలు జిరాక్సు ప్రతులు జతచేయని దరఖాస్తులు తిరస్కారానికి గురవుతాయని సిబ్బంది చెబుతున్నారు. 2013 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారికే ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఫారం 18తో పాటు డిగ్రీ దృవీకరణ పత్రం, రేషన్, ఆధార్, ఓటు కార్డులు జిరాక్సు ప్రతులు గజిటెడ్ అధికారితో సంతకం చేయించినవాటినే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు తహశీల్ధార్ కార్యాలయానికి 6 ధరఖాస్తులు మాత్రమే అందగా ఎం.పి.డి. ఓ కార్యాలయానికి బోణి పడకపోవడం విశేషం. ఇదే పరిస్ధితి కొనసాగితే ఓటరు నమోదు ఎలా వేగవంతం అవుతుందని అనేకమంది ప్రశ్నిస్తారు. జిల్లాలో 4 లక్షల మంది ఉండగా కేవలం 30 వేల మందికే పట్టబద్రుల ఎం.ఎల్.సి గడిచిన ఎన్నికల్లో ఓటర్లుగా మిగిలారు. వీరంతా తిరిగి ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోతారని అధికారుల స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి సంకట పరిస్ధితులు పట్టబద్రుల ఎం.ఎల్.సి ఎన్నికల ఓటరు నమోదును వెంటాడడం బాధాకరం.

సమస్యలు
పరిష్కరిస్తాం

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 17: గ్రీవెన్స్ విభాగంలోని వినతులను సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుండి పలు వినతులు వచ్చాయి. రాజాం నుండి దుంగ రాము తాను 2014లో రాజీవ్ విద్యామిషన్ నిధులతో మోడల్ ప్రైమరీ స్కూల్ అదనపు భవనాన్ని నిర్మించామని, 2015 ఏప్రిల్ నెలలో బిల్డింగ్ అప్పగించామని అయితే ఫైనల్ బిల్లు నేటికీ మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం మండలం పాత్రునివలస గ్రామంలో స్వచ్ఛ్భారత్ కింద మంజూరయిన మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని చుక్క సంధ్య కోరారు. సదర లక్ష్మణ్, పీటర్ సీతం పేట మండలం పిండ్రువాడ గ్రామంలో సౌరశక్తి ఆధారిత పథకాన్ని మంజూరు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీనివాసరావు గ్రామానికి మంచినీటి బోరు మంజూరు చేయాలని కోరారు. గార మండలం రాళ్లపేట నుండి కొమనాపల్లి గణేష్ నాలుగేళ్ల కిందట తీసుకున్న పంట రుణాన్ని మాపీ చేయాలని కోరారు. వీరఘట్టం మండలం తూడి గ్రామం నుంచి కాదాపు లక్ష్మీనారాయణ పంటరుణమాఫీ చేయాలని కోరారు. పాలకొండ మంలం అట్టలి గ్రామం నుండి శిర్ల పోతయ్య పిడుగుపాటుకు తన రెండు గేదెలు మరణించడం వలన తనకు జీవనాధారం లేకుండా పోయిందని ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. గార మండలం కురుమాన జయరాం డిఆర్‌డిఎ ద్వారా ట్రైజమ్ పథకం వలంటీరి వెటర్నరీ వర్కర్ శిక్షణ పొందినందున మినీ డెయిరీ యూనిట్ మంజూరు చేయాలని కోరారు. రణస్థలం మండలం జీరుపాలెం గ్రామం నుండి ఆర్.చిన్నారావు బాలికల హాస్టల్ ఇంచార్జ్ విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నుంచి సకలాభక్తుల జ్యోతి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం టిఫిన్‌క్యాంటీన్ నడుపేందుకు రుణసౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం భవిత ఎడ్యుకేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ రూపొందించిన మద్యం తాగితే జీర్ణాశయ క్యాన్సర్ ఉచితం అనే పాంప్లెట్‌ను విడుదల చేశారు. ఈకార్యక్రమానికి జెసి-2 పి.రజనీకాంతారావు, డిఆర్‌డిఎ పిడి జి.సి.కిషోర్‌కుమార్, డుమా పిడి ఆర్.కూర్మనాథ్, సెట్ శ్రీ సిఈవో వివిఆర్‌ఎస్ మూర్తి తదితరులు ఉన్నారు.

ప్రగతి ఫలాలు ప్రజల ముందు ఉంచండి
పొందూరు, అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆయన స్థానిక మండల రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ డిపోలకు వచ్చి సరుకులు తీసుకోలేని నిర్భాగ్యుల ఇళ్లకు రెవెన్యూ అధికారులు వెళ్లి సరుకులు అందించాల్సి ఉందని ఆ విధంగా బాధ్యత నిర్వహించిన రెవెన్యూ అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్స్ సర్వే పూర్తి చేయాలని ఈ సర్వేపై సంక్షేమపథకాల అమలు ఆధారపడి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీల్లో, కేంద్రాల నిర్వాహణలోనూ ఆరోపణలకు దూరంగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేసేలా ప్రాజెక్ట్ అధికారులు చర్యలుతీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ వరప్రసాద్, జెడ్‌పిటిసి శ్రీరాములనాయుడు, మండల దేశం అధ్యక్షుడు సిహెచ్ రామ్మోహన్, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
శ్రీముఖలింగం క్షేత్రంపై డాక్యుమెంటరీ
జలుమూరు, అక్టోబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో కొలువైయున్న మధుకేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర ఇతర ఆలయాలపై ఏ.పి పర్యాటక శాఖ ఓ డాక్యుమెంటరీని సోమవారం చిత్రీకరించింది. భక్తులకు అవగాహన కలిగించేందుకు డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్టు డైరెక్టర్ మణికంఠ తెలిపారు. గోడలపై ఉన్న శిల్ప సంపద, గోలేం కథ, సోమేశ్వర, భీమేశ్వర ఆలయ విశేషాలు పర్యాటక కేంద్రంగా ఉన్న శ్రీముఖలింగం పదిమందికి తెలియజేసే విధంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుందన్నారు.
కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్‌లు ధర్నా
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 17: తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పలువురు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు కలెక్టరేట్‌వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్రసహాయకులు లక్ష్యం చేరుకోలేదనే కారణంతో తొలగించడం అన్యాయమని సీటు నాయకులు పేర్కొన్నారు.
కలెక్టరేట్ వద్ద సీటు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. పది సంవత్సరాలుగా పనిచేసిన 435మంది క్షేత్రసహాయకులను జిల్లాలో విదుల్లోంచి తొలగించడం వలన వారి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయన్నారు. కనీస వేతనం రూ.10వేలు చేయాలని క్షేత్రసహాయకులను రెన్యూవల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు నారాయణరావు, లక్ష్మణరావు,పోలయ్య, తిరుపతిరావు, సీటునాయకులు పాల్గొన్నారు.
రైలు కిందపడి యువకుడి మృతి
పొందూరు, అక్టోబర్ 17: స్థానిక రైల్వేస్టేషన్ దగ్గర వాండ్రంగి గేటు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని 25 ఏళ్ల యువకుడు మృతిచెందారు. ఆత్మహత్య, ప్రమాదమా అని తేలాల్సి ఉంది. యువకుడు గల్లషర్టు, జీన్ ఫాంట్ ధరించి ఉన్నారు. ఆమదాలవలస రైల్వేపోలీసులకు పొందూరు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎఎ వలసలో
ఉచిత కంటివైద్య శిబిరం
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: మండలంలోని అరిణాం అక్కివలస కూడలివద్ద ఈనెల 19న ఉచిత కంటివైద్యశిబిరం శంకర్ పౌండేషన్ కంటి ఆసుపత్రి (విశాఖపట్నం), జయ సంజీవని ట్రస్టు, జిల్లా అంధత్వ నివారణ సంస్ధ నిర్వహిస్తున్నట్టు ధనాలకోటి రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో అన్ని కంటివ్యాధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని, ఆపరేషన్‌కు ఎంపికైన వారికి డి.బి.సి. ఎస్ సహకారంతో శస్తచ్రికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. దీనిని రోగులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టేబుల్ టెన్నిస్ జట్లు ఖరారు
బలగ, అక్టోబర్ 17: స్కూల్ గేమ్స్ అండర్-17 టేబుల్ టెన్నీస్ బాలబాలికల జట్టును స్కూల్ గేమ్స్ జిల్లా అధ్యక్షులు, డిఈవో డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎంఎస్ శేఖర్‌లు ప్రకటించారు. బాలురజట్టులో ఎస్.రవికుమార్, మణికంఠ, ఎం.్భవానీశంకర్, డి.బ్లెసిన్, జి.మహేష్, డి.దేవహర్షలు ఉన్నారు. బాలికల జట్టులో పి.సుకన్య, టి.సౌజన్య, అశ్విని, కవిత, దివ్యలు తుది జసట్టులో ఉన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుంచి 24వరకు తణుకులో జరగనున్న రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ జట్లకు మేనేజర్లుగా జెవిఎస్ జగన్నాథం, కె.సుశీలలు వ్యవహరిస్తారు.
ఎంపికైన క్రీడాకారుల ఈనెల 21న ఉదయం 7గంటలకు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు హాజరు కావాలని ఎలిజిబులిటీ ఫారంలు, రెండు ఫోటోలు, ముందు సంవత్సరం మార్కుషీట్, ఆధార్ కార్డుజిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.

‘శిష్టకరణాలను
ఓబీసీలో చేర్చాలి’
శ్రీకాకుళం(కల్చరల్), అక్టోబర్ 17: శిష్టకరణాలను ఓబీసీలో చేర్చాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపురామ్మోహన్‌నాయుడుకి వినతిపత్రం అందజేశామని నగర శిష్టకరణ సంఘ అధ్యక్షుడు బెహర రామచంద్రారావు అన్నారు. సోమవారం స్థానిక కత్తెరవీధిలో శిష్టకరణ సంఘ గౌరవాధ్యక్షుడు కె.రామకృష్ణారావు స్వగృహం వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరికీ తాము కలుస్తున్నామని అతి త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కూడా కలుస్తామన్నారు. అదే విధంగా నవంబర్ నెల 27న శిష్టకరణ సంఘ వనభోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు పెదపెంకి శ్రీరామకుమార్, ఆర్‌విఎం శర్మ, గోకుల్ విజయ్, డబ్బీరు వెంకటరావు, బలివాడ నూకరాజు, సత్యసాయి వాసు పాల్గొన్నారు.