రాష్ట్రీయం

స్కైవేలకు నేడు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో రూ. 886 కోట్ల పనులకు శ్రీకారం

హైదరాబాద్, జనవరి 2: భాగ్యనగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు మహానగర పాలక సంస్థ రూపొందించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. జూలై 24న ఈ స్కీం కింద నగరంలోని వివిధ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నివారణకు స్కైవేలు, మల్లీలెవెల్ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లను నిర్మించేందుకు మొత్తం రూ. 4051 కోట్ల పనులను అనుమతించిన సంగతి తెలిసిందే! ఇందులో రూ. 2631 కోట్లకు గాను మంజూరీ ఇస్తూ ప్రత్యేకంగా జివో జారీ చేసినా, పనులు చేపట్టేందుకు సంస్థలు ముందుకు రాకపోవటంతో మరోసారి టెండర్లను ఆహ్వానించారు.
దీంతో కెబిఆర్ పార్కు, రాజీవ్‌గాంధీ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్ల వద్ధ మొత్తం రూ. 886 కోట్ల పనులకు ఎజెన్సీలు ఖరారు కావటంతో ఆదివారం నుంచి పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మూడు ప్రాంతాల్లో డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు కెటిఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలు పనులు ప్రారంభించనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలు, పనులు, నాణ్యత, బిల్లుల చెల్లింపులు వంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి సర్కారు గత జూలైలోనే ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే!
ఈ మంజూరీతో జిహెచ్‌ఎంసి అధికారులు నగరంలో నిత్యం రద్ధీగా ఉండే జూబ్లీహిల్స్ కెబిఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో మల్టీలెవెల్ ఫ్లైవోవర్లు, అలాగే ఏ జంక్షన్‌లోనూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా, పాదచారులకు ఎలాంటి ఇక్కట్లు ఎదురుకాకుండా చర్యలు చేపట్టడంలో జిహెచ్‌ఎంసి, ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేక పర్యవేక్షణ కోసం ఉన్నత స్థాయి కమిటీని సైతం సర్కారు నియమించింది.