హైదరాబాద్

అన్ని మురికివాడల్లో దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: గ్రేటర్ హైదరాబాద్‌ను మురికివాడల్లేని నగరంగా తీర్చిదిద్దనున్నట్లు, ఇందుకు గాను ప్రతి మురికివాడల్లో దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. నగరంలోని ముషీరాబాద్, విద్యానగర్, బాగ్‌లింగంపల్లి తదితర ప్రాంతాల్లో గురువారం ఆయన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగేళ్లలో లక్షా 8వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను దశల వారీగా నిర్మించేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మురికివాడల్లో ఈ ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ అందుబాటులో ఉన్నా, ఈ ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పదివేల ఇళ్లను, వచ్చే సంవత్సరం 25వేల ఇళ్లను, మరుసటి సంవత్సరం మరో 50వేల గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరగని రీతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి జిహెచ్‌ఎంసి ద్వారా విజయవంతంగా ఐడిహెచ్‌కాలనీని లబ్దిదారులకు అందించామని వివరించారు. హైదరాబాద్ నగరం 30 ఏళ్లుగా విద్యుత్ కోతలకు గురవుతూ, నిరుపేదలు, కార్మికులు, సరైన ఉపాధి అవకాశాలు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందజేస్తుందని వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నగరంలో తమ ప్రభుత్వం లక్షా 8వేల మందికి ఇళ్ల పట్టాలను ఉచితంగా అందజేసి రికార్డు సృష్టించిందన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు వెయ్యి రూపాయలు, 1500 అందిస్తూ వృద్థులు, వికలాంగులకు, వితంతువుల జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు. హోం శాఖ మంత్రి నాయిని మాట్లాడుతు పేదల కష్టాలను బాగా తెల్సుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక కృషి కారణంగానే నగరంలో డబుల్ బెడ్ రూం స్కీం అమలుకు నోచుకుంటుందన్నారు.
అనంతరం ఎక్సైజ్ శాఖ పద్మారావు మాట్లాడుతొ నగరానికి మంచినీరు అందించే జలాశయాలు పూర్తిగా ఎండిపోయినప్పటికీ, ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో, నీటి ఎద్దడి తీవ్రం కాకముందే గోదావరి జలాలను తీసుకువచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.