హైదరాబాద్

స్మార్ట్ హైదరాబాద్‌లో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, డిసెంబర్ 27: రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లిలోని తారానగర్, చందానగర్, దీప్తిశ్రీనగర్ చోట్ల బిజెపి జెండాలను ఎగరవేశారు. మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్‌ను స్మార్ సిటీగా కేంద్రం ప్రకటించిందని, రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ పొరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మీసాల చంద్రయ్య, రాష్ట్ర నాయకులు ఎం.్భంరావు, కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాచమళ్ల నాగేశ్వర్‌గౌడ్, శేరిలింగంపల్లి కన్వీనర్ వసంత కుమార్ యాదవ్, చింతకింద గోవర్దన్ గౌడ్, నూనె సురేందర్, రాకేశ్ దూబె, యువమోర్చా నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నిఖిలేష్, రాంరెడ్డి పాల్గొన్నారు.

ముదిరాజ్‌లను బిసి ‘డి’ గ్రూపు నుంచి ‘ఎ’గ్రూపులోకి మార్చాలి
హైదరాబాద్, డిసెంబర్ 27: ముదిరాజ్ వాటి ఉప కులస్థులను బి ‘డి’గ్రూపు నుంచి బిసి ‘ఎ’గ్రూపులోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి యాదగిరి ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనకు పలు సంఘాలు సన్మానించాయి. యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఉన్న నిరుపేద ముదిరాజ్ కులస్థుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్టు తెలిపారు. పుట్టి యాదగిరిని రాష్ట్ర కార్యాలయంలో మాల సంక్షేమ సంఘం సలహాదారు జెఆర్ కాంతారావు, విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు నాగభూషణం, ఎమ్మార్పీఎస్ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కుంట్లూరు సురేష్ సన్మానించిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు కుంట్లూరు రాము ముదిరాజ్, నాగేష్ ముదిరాజ్, సుదర్శన్ ముదిరాజ్, రవీందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయఢంకా
ఉప్పల్, డిసెంబర్ 27: గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ యూత్ విభాగం నాయకుడు గుమిడెల్లి రాజేష్ ఆధ్వర్యంలో రూపొందించిన టిఆర్‌ఎస్ నేతల ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్‌ను ఆదివారం హబ్సిగూడలో పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఆకర్షితులై ఆంధ్ర పార్టీలను ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. తిరుగులేని టిఆర్‌ఎస్ గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరటికాయల భాస్కర్, గుమిడెల్లి మల్లేష్, తవిడబోయిన గిరిబాబు, గోపు సదానంద్, సింగారం కార్తీక్, క్రిష్ణకుమార్, రాకేష్, రవీందర్, నవీన్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, గుమిడెల్లి బాల్‌రాజ్ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ దెబ్బకు అన్ని పార్టీలు గల్లంతు
రాజేంద్రనగర్: తెదేపాకు కంచుకోటగా చెప్పుకుంటున్న రాజేంద్రనగర్‌లో టిఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతుందని నియోజకవర్గం అధ్యక్షుడు అన్నపురెడ్డి భీమార్జున్‌రెడ్డి అన్నారు. ఆదివారం మధుబన్‌కాలనీ, పద్మశాలిపురం బస్తీలలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన కూడళ్లల్లో టిఆర్‌ఎస్ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. మధుబన్‌చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు రాజేంద్రనగర్‌లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధిని పట్టించుకున్న పాపన పోలేదని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభంజనానికి టిడిపి పాతాళానికి వెళ్లక తప్పదని జోష్యం చెప్పారు. గ్రేటర్ ఎన్నికలలోపే టిడిడిలో ఒక్కరు లేకుండా ఖాళీ చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో సర్కిల్ జాగృతి కన్వీనర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, ఎన్ను శ్రీనివాస్‌రెడ్డి, సామల సత్యం, పి.సత్యనారాయణ, వినోద్, యాదయ్య, లక్ష్మణ్, విజయలక్ష్మి, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, రాఘవచారి, జి.కృష్ణ, రాజేష్ యాదవ్, రవి యాదవ్, స్వప్న, ఎర్ర యాదయ్య, పి.శ్రీశైలం, దుర్గేష్, చంద్రమోహన్, నర్సింగ్‌రావు, సి.బుచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, కుమార్, నాగరాజు పాల్గొన్నారు.