ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో ప్రజాసాధికార సర్వే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. విజయవాడలో సిఎం చంద్రబాబు నివాసానికి అధికారులు వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సర్వేను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు సర్వే దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30వేల మంది సిబ్బందితో సర్వే నిర్వహిస్తున్నారు. ఆధార్‌, కులం, ఆదాయం వంటి 20 పత్రాల వివరాల సేకరణ జరుగుతోంది. రోజుకు ఒక్కో సిబ్బంది 15 నుంచి 20 కుటుంబాల సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సర్వే ద్వారా ‘జిప్పర్‌ కోడ్‌’ పేరిట ప్రతి ఇంటికీ డిజిటల్‌ కోడ్‌, 8 అక్షరాల్లో సరికొత్త నెంబర్లు జారీ చేయనున్నారు. రెవెన్యూశాఖ నేతృత్వంలో ట్యాబ్‌లు, యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తారు.