యువ

ఎలా కావాలంటే అలా తిరిగే స్మార్ట్‌వాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలపు యూత్‌ను ఎప్పుడైనా గమనించారా? చేతికి వాచ్ పెట్టుకునే చోట స్మార్ట్‌వాచ్ కనిపిస్తోంది! ఫిట్‌నెస్ ట్రాకర్‌తో సహా రకరకాలుగా ఉపయోగపడే స్మార్ట్‌వాచ్‌లకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ స్మార్ట్‌వాచ్‌ను రన్నింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తూ చూసుకోవడం కాస్త ఇబ్బంది. ఎందుకంటే చేతిని పూర్తిగా తిప్పి ముఖానికి ఎదురుగా పెట్టుకుని చూడవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని గమనించిన ఎడ్జ్‌గేర్ అనే సంస్థ స్మార్ట్‌వాచ్‌లకు ఓ బాండ్‌ను తయారు చేసింది. దీనిపేరు షిఫ్ట్. యాపిల్ వాచ్, మోటో 360, గేర్ ఎస్2 క్లాసిక్, పెబుల్ టైమ్ వంటి అన్ని రకాల స్మార్ట్‌వాచ్‌లకూ, ఫిట్‌నెస్ ట్రాకర్లకూ ఇది సరిపోతుంది. దీనిలో ఉన్న వెసులుబాటు ఏమిటంటే- షిఫ్ట్‌లో అమర్చిన స్మార్ట్‌వాచ్‌ను మీరు ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో తిప్పుకోవచ్చు. ఫోటోలో చూస్తున్నారుగా...అలాగన్నమాట.