బిజినెస్

టైటాన్, హెచ్‌పి సారథ్యంలో మార్కెట్‌లోకి స్మార్ట్ వాచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: స్మార్ట్ వాచీల కోసం వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌పి సోమవారం చేతులు కలిపాయి. భారత్‌తోపాటు పలు విదేశీ మార్కెట్లలోకి వచ్చే నెలాఖర్లో ఈ స్మార్ట్ వాచీలను తీసుకురానున్నట్లు టైటాన్ కో ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల అభిరుచి తగ్గట్లుగా ఈ స్మార్ట్ వాచీలను పరిచయం చేస్తామని టైటాన్ కో వాచెస్, యాక్ససరీస్ డివిజన్ సిఇఒ ఎస్ రవి కాంత్, హెచ్‌పి వియరబుల్స్, స్టార్ట్ ప్లాట్‌ఫామ్స్ జనరల్ మేనేజర్ శ్రీధర్ సోలూర్ చెప్పారు. కాగా, టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఐడిసిఒ) కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచరే టైటాన్. గత ఆర్థిక సంవత్సరం 2014-15లో 11,791 కోట్ల రూపాయల ఆదాయాన్ని టైటాన్ పొందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2013-14తో పోల్చితే ఇది 9 శాతం అధికం.