రాష్ట్రీయం

చిన్న ఊరుకు పెద్ద గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి పొగ రహిత
గ్రామంగా కేతరాజుపల్లి
అన్ని కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు
రావులపాలెం, డిసెంబర్ 28: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని అతి చిన్న గ్రామమైన కేతరాజుపల్లి రాష్టస్థ్రాయి గుర్తింపు పొందింది. మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం శాఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ద్వారా చేపట్టిన పొగ రహిత గ్రామాల పథకంలో (స్మోక్‌లెస్ విలేజెస్) భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గ్రామంగా కేతరాజుపల్లిని ఎంపిక చేశారు. కట్టెలు, పిడకలు తదితర పురాతన పద్ధతుల్లో వంట చేయడం వల్ల వాతావరణ కాలుష్యం, పొగ కారణంగా మహిళల ఆరోగ్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది నవంబర్ రెండు నుండి ఈ పథకం అమల్లోకి తెచ్చింది. ఐఒసిఎల్ విశాఖపట్నం రీజియన్ చీఫ్ ఏరియా మేనేజర్ సిహెచ్ విజయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 300 కోట్ల మంది ఇంకా కట్టెలపొయ్యి మీద వంట చేస్తున్నారన్నారు. దీంతో ప్రతి ఏడాది ఈ పొగ పీల్చడం వల్ల సుమారు 40 లక్షల మంది చనిపోతున్నారని, లక్షలాది మంది ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. చనిపోతున్న వారిలో యాభై శాతం మంది అయిదేళ్లలోపు పిల్లలేనని తెలుస్తోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఒక ఇంట్లో ఒక రోజు కట్టెల పొయ్యి వంట వల్ల వచ్చే పొగ 400 సిగరెట్ల పొగతో సమానమని అంచనా. ఇంత ప్రమాదకరమైన ఈ విధానానికి స్వస్తి పలికి అందరూ గ్యాస్ ద్వారానే వంట చేయాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పొగ రహిత గ్రామాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో మొదట కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ జిల్లా వ్యాసకూర్‌హల్లీ గ్రామాన్ని తొలి పొగ రహిత గ్రామంగా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి కేతరాజుపల్లి తొలి గ్రామంగా ఎంపికైంది. ఈ గ్రామంలో 998 మంది జనాభా ఉండగా 333 ఇళ్లున్నాయి. అధికారులు జరిపిన సర్వేలో 113 గృహాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకుంటున్నట్టు నిర్ధారించారు. సోమవారం గ్రామంలో జరిగిన ప్రారంభ సభలో వీరికి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. తద్వారా ఈ గ్రామంలో కుటుంబాలన్నీ గ్యాస్ కనెక్షన్ పొందారు.