స్మృతి లయలు

రాత ఫత్రికకు ఆరణాల చందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర, వాహిని, జమీన్ పత్రిక - నెల్లూరు పత్రిక కూడా మా దాడి తప్పించుకోలేక పోయాయి. మా వూరి ‘బొమ్మల బస్తీ’ని కూడా వొగ్గలేదు మేము. గృహలక్ష్మికి ఆంధ్ర మహిళ పోటీ. నాకూ రెంటితో భేటీ. మాతృసేవ అనే దానిలో నెలనెలా వ్యాసం మస్టూ.. కానీ ఇది కాదు నా మొదటి ‘కాలం’. చెబుతా తర్వాత.
మా స్కూలు ఎదురుగుండా వున్న గాంధీ పార్కులో రీడింగు రూము ఉంది. కాని ఆ గుమాస్తా - అడ్డం పడ్డాడు - పిల్లకాయలు పోకూడదు అనేవాడు.
మునిసిపల్ స్కూలు స్టూడెంట్స్‌కి మునిసిపల్ రీడింగ్ రూములో ప్రవేశం లేదా? గాంధీజీ వీడిని క్షమించడురా అన్నాడు మా కాకర్ల (నా క్లాసుమేటు) - మా లిఖిత పత్రిక ‘మిత్ర’ పేరు చెప్పి, వీడు దాని ఎడిటరు తెలుసా? అని పోట్లాడాడు. నవ్వేశాడు ఆ లైబ్రేరియన్. మా నారాయణ (కాకర్ల) తిట్టాడు. ‘వేధౌ (వెధవ) మొహం పెట్టుకుని నువ్వొద్దు అంటే ఎట్లా? మేము బాగా చదవలేకపోతే మార్కులెవడిస్తాడు? ఆ పాపం మీదే అవుతుంది సార్!’ అన్నాడు. కాకర్ల నారాయణ వాడి పూర్తి పేరు. ఇంకా మున్ముందు వీడి గొప్ప తెలుస్తుంది.
రీడింగు రూమ్స్‌లో చదివే - వాడు నేతాజీ సుభాష్ బోస్ అంతవాడయ్యాడు తెలుసా? చూడు మా వాడు ఎప్పుడూ నేతాజీ బుష్ షర్టు మాత్రమే వేసుకుంటాడు. పైగా వీడు స్వామి వివేకానందుని భక్తుడు. వాడి నోట్‌బుక్ మీద ఇలా చూడు - వివేకానందుని బొమ్మ. వాదించాడు కాకర్ల.
నిజంగా ఐ లవుడ్ బోత్ ఆఫ్ దెమ్ స్వామీజీ నేతాజీ.. నా వీరాజీ అన్నపేరు మీద కూడా ఉంది ఆ మహనీయుల ప్రభావం.
‘అబ్బాయిలూ! ఎవ్వరికి చెప్పకుండా వచ్చి చదువుకోండి. మీ స్కూలు అంతా రౌడీ సజ్జు.. ....’ అని ఏదో తిట్టు అనుకుంటూ లోపలికి తీసుకుపోయాడు. ఇక ‘నోల్లేయడమే’.. మాకు కుర్చీలో కూర్చుంటే బల్ల మీది పుస్తకం అందదుగా - అందుకని నిలబడి ఓ కాలు మార్చి, ఓ కాలు ఇలాగెత్తి మోకాలి మీద ఆన్చి నిలబడి చదివేవాడిని.
మా కాకర్ల - గిరీశం చెప్పినట్లు ‘్ధనరు’ లేపేసేవాడు ఏమి మాట్లాడినా.
మేమంతా ఇంటి పేర్లతోనే పిల్చుకొనేవాళ్లం. ఒరేయ్ పిళ్లా (నేను).. ఒరే పుచ్చా.. కోటా.. కర్రి - ఇలాగ.
విశాఖపట్టణం సిబిఎం స్కూల్లో మాత్రం నంబర్లు పెట్టీ కేకేసుకొనేవాళ్లం. ఆ కథ వేరే వుంది. ఫార్టీ నా నెంబరు.
‘ఐడియా బాగుంది కృష్ణమూర్తీ - మన పత్రికని ఈ రీడింగు రూములో పెడదాము..’ అన్నాడు ‘గూడూరు’ (వెంకటరావు) మంచి ‘మిత్ర’ ఆర్టిస్టు.
‘ఒరేయ్! ఆ బాబాయ్ (లైబ్రేరియన్) కడుపు మండి బుక్ చింపేస్తే.. దిక్కేమిటిరా? ఈ సంగతి మనం కమిటీలో పెట్టి చర్చిద్దాము’ అన్నాను గంభీరంగా - మా రాత పత్రిక అయితే మాత్రం తక్కువ తిన్నదా? ఏమిటి? దానికి కమిటీ ఉంది. నెలకి ఆరు అణాల చందా ఉంది. టీచర్లకి, అమ్మాయిలకి మెంబర్‌షిప్ లేదు. సింగంపల్లి అప్పారావు.. ఆనక వందలాది కథలు చందమామ మున్నగు పత్రికల్లో దంచేశాడు. వీడు మా అమ్మకి పెంపుడు కొడుకులలో ఒకడు. (తూర్పు వాడు) కుస్తీలు కూడా వచ్చు వాడికి. కానీ పిరికోడు అంటారు. వాడి దస్తూరీ బెట్టర్.. అంచేత లేఖకుడు.
పోతే, (శకుం)తలా మీటింగుకి వస్తానన్నది - వద్దంటే - ఆమె (కుంతల నిక్‌నేమ్) మా ఎంప్టీ టీచర్ కూతురు.. అదీ ఆమె నిక్కు. ఆ కార్పెంటింగు మాస్టారు.. కూతురు చెబితే చాలు - రూల్స్‌కి వ్యతిరేకంగా చెయ్యి చేసుకుంటాడు. పైగా, నోరు చెత్త. అంచేత, కుసుమ అడిగితే ఈమెని కూడా - ఓకే అన్నాను. కుసుమ కాజ నుంచి రైల్లో వస్తుంది. గౌను వేసుకుంటుంది. చిన్నపిల్ల. కుంతలా పెద్దది. చీర కట్టుకొని వచ్చింది వోసారి.. అసలు ‘నో’ అన్నా మీటింగుకి వచ్చి కూర్చుందోసారి. ఫిర్ క్యా కరేం?
మా భయం ‘రివిట్’ వస్తానంటుందేమో?నని - రివిట్ అని ఓ పెద్దమ్మాయి ఫిఫ్త్ ఫారం - డి సెక్షన్. ఆమెని ఏడిపించే ఫిఫ్తు ఫార్మ్ గ్యాంగు మా మీటింగు పాడుచేస్తే?
-హెచ్ ఎంకి చెబుదాం అన్నాడు కాకర్ల.
అన్నట్లు, రివిట్ గొప్ప ఏమిటో చెప్పలేదు కదూ. నాకూ తెలియదు. రివిట్ అన్నది నిక్‌నేమ్. మురళి కూడా రివిట్ రివిట్ అని అరిచేవాడు. వాణ్ని అడిగాను. ఏమో ‘క్రిష్నా’ - అదో సినిమా యాక్టర్‌లాగా ఉంటుంది. మూడేళ్లుగా అదే క్లాసు. ఆమె ఫ్రెండు ఖానుగాడు (ఆ మాట మెల్లిగా అనాలి) ఎన్నడో స్కూలుకి ఎగనామం పెట్టి బీడీల దుకాణం పెట్టేడుట.. ఈ శాల్తీ కోసం ఇంకా వస్తూనే ఉంటాడు..’
కాకర్ల... టాపిక్ కట్ చేశాడు. ‘చెత్త ఆపుతారా? అదేమయినా వరూధినా?’ ఈ పద్యం వినండి అని ఎత్తుకున్నాడు.
ఆ రౌడీ ఖాన్‌గాడు ఫుట్‌బాల్ ఆడేవాడుట. ఈ అమ్మాయిని లవ్ చేయడానికి ముందే వాణ్ని తిట్టింది. వాళ్ల ‘్ఫర్త్ ఫార్మ్’లో.. అట్లా నన్ను తెలుగులో తిట్టమాకు అన్నాడుట. నీ నోటికి ‘రివిట్’ వేయిస్తానన్నాడుట. అంతే, వాడు వాడి గ్యాంగు - రివిటా? భలే! ఖాన్ భాయి భలే అన్నావురా..’ అని విరగబడి నవ్వేరుట. పాపం పద్మిని పేరు కాస్తా రివిట్ అయిపోయింది. మా స్కూలుకి ‘రిఫ్ రాఫ్’ గాలి ఎక్కువే. పైగా ముస్లిం ఆడపిల్లలకి జననా క్లాసులు అంటే ఘోషా క్లాసు రూమ్స్ ఉన్నాయి. ఆ క్లాస్‌కే వహీదా రహమాన్ (తర్వాత సినిమా స్టార్ అయింది) వచ్చేది. వాళ్ల నాన్న రహమాన్ మునిసిపల్ ఆఫీసర్. (ఇంకా బోలెడుంది)

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com