స్మృతి లయలు

రచయితల కొలువులో ‘మలుపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 1960లో తొలి మలుపు అగ్రిమెంట్ విశాలాంధ్ర ప్రచురణకర్తలు పక్కాగా లీగల్‌గా తయారుచేశారు. మా అగ్రిమెంటు టైపు చేసిన టైపిస్ట్ ఎవరో తెలుసా? అటు తరువాత నవోదయా రామమోహనరావుగా పుస్తక ప్రపంచంలో ఒక చక్రం తిప్పిన మహర్జాతకుడు. అప్పుడు విశాలాంధ్ర సంస్థ జనరల్ మేనేజర్. విజయవాడకి రెండుసార్లు మేయర్ అయినట్టి వెంకటేశ్వర్లు (టివి) గారు. ఆపాటికే మహీధర రామమోహన్‌రావుగారు తొలి మలుపుకి ముందు మాటలు రాసేశారు. ‘జీవితం యొక్క తొలి మలుపు మీద మన దృష్టిని ప్రసరింప చేయవల్సిన అవసరాన్ని మిత్రుడు వీరాజీ ఈ చిన్ని నవలలో విజయవంతంగా నిరూపించాడు’ అని. ‘ఏమిటోయ్ తెల్లారేపాటికి హీరో అయిపోయావ్?’ ఫేసు వేల్యూ మీద టెన్‌పర్సెంట్ రేటు టాప్ తెలుసా? అన్నారాయన గర్వంగా. విశాలాంధ్రలో పిన్నా పెద్దా అంతా నన్ను అనురాగ వాత్సల్య దృక్కులతో అక్కున అదుముకోవడం అందరికి నేను ‘లాడ్లా’ అవడం - మరపురాని సన్నివేశం. బెజవాడ గవర్నర్‌పేట రాజగోపాలాచారి స్ట్రీట్‌లో జైహింద్ టాకీసు పక్కనే వుండేది ‘విశాలాంధ్ర’ కార్యాలయం. అంతకు ముందు అది జన్మభూమి అనే డైలీ ఆఫీసుట. నాకు ఆ పత్రికని చూసినట్లు కాస్త జ్ఞాపకం. శారద అని చిన్న సింగిల్ షీట్ పత్రిక గాంధీ నగర్‌లో వచ్చేది. అది జ్ఞాపకం. నేను తొలి మలుపు సీరియల్‌గా చదువుతున్నప్పుడే - విశాలాంధ్ర దినపత్రిక కార్యాలయం ఆఫీసు ‘మరిగాను’. ఠంచన్‌గా వెళ్లేవాన్ని. దానికి పక్కనించి ప్రెస్ వేపు బిల్డింగ్‌లోకి ‘మెలికల మెట్లు’ ఉండేవి. ప్రూఫ్‌రీడర్స్ బల్ల మీదుగా లోపలికి దూరిపోయేవాణ్ణి. చిన్నరూములో ‘సందేశం’ పత్రిక రూము ఓ కార్నర్ - అందులో సీనియర్‌గారు రామ్మోహన్‌గారు - మరో కుర్చీ వుండేది. నేను అందులో బైఠాయించేవాణ్ణి బుద్ధిగా.
అసలు తొలి మలుపునకు ఆ పేరు ఖాయం చెయ్యడానికి - పెద్ద చర్చ జరిగింది. విజయ సాహితీలో రెండు వారాలు - అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) కొమ్మూరి, కొండముది, రాఘవ ఎల్లోరా వగైరా హేమాహేమీలు కూడా దిగడ్డారు. వెలక్కాయంత రాతిగవ్వ, గుమ్మడికాయంత మంచి మముత్యం - ఖేసరా సర’ లాంటి పేర్లన్నీ ‘టూ పర్సనల్’ సోషల్ నవల కదా? ఇది’ అన్నారు మహిళా పెద్దలు కూడా. అట్లా పద్దెనిమిది పేర్లు. తారుణ్యపు తొలి రోజులు.. అన్నాడు మంజుశ్రీ. తొలివలపు అన్నారెవరో మక్కెన సుబ్బారావు అనుకుంటాను. ఇది ట్రాజెడీ దీన్ని కామెడీ చేయకండయ్యా అన్నారు నిడమర్తి ఉమారాజేశ్వరరావు (ఈయన నేను రష్యా పోయినప్పుడు వారి ఇంటికి తీసుకుపోయారు) ‘ఫస్ట్ టర్న్ ఆఫ్ లైఫ్’ అని ఒక సూచన - నేను మెల్లిగా భయంగా అన్నాను తొలి మలుపు - అనడం బాగుంటుందేమో? కథలో ఈ మాట వస్తూనే వున్నది కదా? ఒక్క ఉదుటున లేచారు సభ్యులు ‘ఓకే’ ఖాయం. అట్లా తొలిమలుపు వీరాజీ తయారయ్యాడు. కవరు బొమ్మలన్నీ ‘వెంబు’గారే వేసేవాడు. ఆయనకి ఐడియా ఇస్తూ - కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులో వున్న వారి ఇంటికి వెళ్లాను. సహృదయంతో నన్ను అర్థం చేసుకుని ఆయన (సింగిల్ కలర్ ప్లస్ బ్లాక్) చక్కని చిత్రం (రెండు ఎడిషన్లకి కూడా గీశాడు. వారి మాతృభాష తమిళం కాబోలు). ఆనక ’76లో ‘బాపు’గారు. దీనికి ఆధునిక సాహిత్యంలో అనర్ఘ రత్నమ్‌గా ఎమెస్కో ఎం.ఎం.రావుగారు ప్రచురించినప్పుడు బాపుగారు చిత్రం వేశాడు. కాగా, రాతిమేడని మహీధర నా తొలి నవలగా ‘అవంతి’ ప్రచురణగా. ముందే ముద్ర వేసి రిలీజ్ చేశారు. దాని మీద రివ్యూలు (ఎంతో అదృష్టవంతుణ్ని) ఈ నవల వెనుక అట్ట మీద బ్లర్బ్‌లో ఉద్యోగం ఉద్యోగానే్వషణ - అని వుంది అది చూసి దాన్ని కూడా నా రాబోయే నవల అనుకొని - దేశి కవిత శివరామకృష్ణ గారు అది కావాలని కబురెట్టారు. అప్పుడు బెజవాడలో మరో డైలీ లేదు కాని 59 సమ్మె పూర్తి అయినాక ఆంధ్రప్రభ వీక్లీ సహా ప్రభ డైలీ గాంధీనగర్, అయిదు రోడ్ల జంక్షన్‌లో (ఇప్పుడిది ఐలాపురం హోటల్. అప్పుడు జార్జ్ ఓక్స్ వారి కార్ల షోరూము ఉండేవి) మొదలైంది. నార్ల గారు బయటకి రావడం - నీలంరాజు వారు సంపాదకునిగా డైలీ, అద్దాల గోడ భవనంలో మొదలైంది. ప్రభ ‘వీక్లీ’లో, రావూరి సత్యనారాయణ గారు (వడగండ్లు ఫేం) శార్వరిగారు డైలీలో తిరుమల రామచంద్ర, బెల్లంకొండ, రెంటాల వగైరా వుండేవారు. తమ్ముడు ‘శేషయ్య’గారికి ‘పెట్’ కార్టూనిస్టు. ఇవతల విశాలాంధ్రలో పెద్దలు ఏటుకూరి బలరామమూర్తి గారే స్వయంగా నా రెండు నవలల (తొలిమలుపు, రాతిమేడ) రివ్యూ తానే చేశారు. అక్కడ ప్రభ వీక్లీకి ఈ రెండు నవలల మీద - శార్వరి (కృష్ణశర్మ అసలు పేరు)గారు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేటంతటి అద్భుతమైన రివ్యూలు చేశారు. ‘ఆహా! ఎంత బాగుందీ’ అనిపిస్తాయి అన్నారు శార్వరిగారు నా యొక్క శైలికి నా ‘మాట-మ్మలకి’ (ఇమేజరీ) ఫిదా అన్నారు పెద్దలు. మహీధర వారు జులై 15, 1960 - చేతిలో రెండు గ్యాలీలు (ప్రూఫ్‌లు) పట్టుకుని వచ్చారు. నేను షరా మామూలేగా ఎడిటోరియల్‌లోలా తిరిగి తిరిగి, బూరెలు తిన్న బుద్ధిశాలిగా బలరామమూర్తి గారి రూములో. ‘నువ్వు అవతలికి నడు’ అని త్రోలేశారు నన్ను రామ్మోజీ, ఆయన చేత నన్ను ప్రూఫులు నా తొలి మలుపు మీద బలరామమూర్తి గారి రివ్యూట. ఆనక తెలిసింది. దాన్ని సగానికి సగం కోయించారుట. పేజీల్లో పెడుతూ వుండగా. రామ్మోగారే చెప్పారు. కుర్రవాడి మీద ‘ప్రిజుడిస్సు’ - కుర్రవాడికి తలబిరుసు రెండూ రాకూడదు అన్నారట ఆయన. తెలుగు స్వతంత్ర నవలల్లో తొలి మలుపుది ఒక ప్రత్యేక స్థానం అన్నారు ఏటుకూరి బలరామమూర్తి. పత్రికకి ప్రచురణాలయానికి కూడా ఎడిటర్ ఆయన. శార్వరిగారు అడుగడుగునా వాస్తవికత తొంగి చూస్తోంది.. ఆహా! ఎంత బాగుందీ అని సోదాహరణంగా రాశారు రామ్మోహన్‌గారు వాళ్ల పెద్దబ్బాయి నళినీ మోహన్ రష్యాలో పై చదువులు భౌతిక శాస్త్రంలో చదువుకుంటూ వుంటే, అతనికి ఆవకాయతోపాటు తన నవల రథచక్రాలు, నా నవలలు రెండూ -తొ.మ. రా.మే లను కూడా పంపించారు. అట్టి తరి: విడీవిడని చిక్కులు - (శతముఖాలు లేదా రథయాత్ర మొదటి పేర్లు) విజయ సాహితిలో కొత్త సీరియల్‌గా మొదలెట్టి వినిపిస్తున్నాను. ఈ నవల నాకు ‘పత్రిక’ నుంచి ఉద్యోగానికి పిలుపు తెచ్చింది అనుకోకుండా.

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com