సంజీవని

పెద్దవాళ్ళకీ టీకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా టీకాలు చిన్న పిల్లలకే వేస్తారనుకుంటాం కానీ పెద్దవాళ్ళకీ టీకాలుంటాయి. టెట్నస్ (్ధనుర్వాతం), న్యుమోనియా, ఫ్లూ, హెపటైటిస్, సర్‌వైకల్ కాన్సర్, జోస్టర్‌లకూ, టీకాలని పెద్దవాళ్ళకూ వేస్తారు. 16-25 మధ్య వయస్సుగల వాళ్ళకి కొన్ని ప్రత్యేక టీకాలున్నాయి. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకీ టీకాలున్నాయి.
ధనుర్వాతానికి టీకా
ధనుర్వాతం రాకుండా టెట్నస్ టీకాలు వేస్తారు. టెట్నస్‌లో క్రింది దవడ పట్టుకుపోతుంది. క్లోస్ప్రిడియం టెటానీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడంతో ధనుర్వాతం వస్తుంది. ఇది గాయం ద్వారా టెటెనోస్పాస్మిన్ అనే విష పదార్థాన్ని శరీరంలోకి ఉత్పత్తి చేయడం ద్వారా టెట్నస్ వస్తుంది. ఈ విషం నరాల వ్యవస్థని దెబ్బతీస్తుంది. దాంతో నరాల నుంచి వెన్ను నుంచి పైమెదడుకి సిగ్నల్స్ అందవు. ప్రతి 10 సంవత్సరాలకి వాక్సిన్‌ని చేసి ఇది రాకుండా కాపాడుకోవచ్చు.
న్యూమొకోకల్ వ్యాక్సిన్
పిసిబి 13 అనే వాక్సిన్‌ని 5 సంవత్సరాలలోపు వాళ్ళకి, 19 సంవత్సరాలు పైబడినవాళ్ళకి లక్షణాలను బట్టి తప్పకుండా చేయాలి. 65 సంవత్సరాలు, అంతకుపైబడిన వాళ్ళకోసం పిపివిఎస్‌వి 23 వాక్సిన్‌ని వేయించాలి. సికిల్ సెల్ డిసీజ్, హెచ్‌ఐవి, కాన్సర్‌తో బాధపడేవాళ్ళకి, సిగరెట్లు ఎక్కువగా తాగేవాళ్ళకి, అస్త్మా, డయాబెటిస్, క్రానిక్ లంగ్- కిడ్నీ వ్యాధులు వున్నవాళ్ళకి రిస్క్ ఎక్కువ కాబట్టి ఈ వాక్సిన్ వేయించాలి.
ఫ్లూవ్యాక్సిన్
కొన్ని సీజన్‌లలో ఫ్లూ ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడూ ఫ్లూ వాక్సిన్‌ని చేయించడం అవసరం. ఈ వాక్సిన్‌తోపాటు యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.
హెపటైటిస్ (జాండిస్)
హెపటైటిస్ ఎ, బి, సి, డి అని వేరు అయినప్పటికీ, వ్యాధి ఒక్కటే! లివర్ ఇన్‌ఫ్లమేషన్‌తో జాండీస్‌తో హెపటైటిస్‌ని గుర్తించవచ్చు. హెపటైటిస్ సి, డి, ఈ లకి వ్యాక్సిన్ లేనప్పటికీ, ఎ, బిలు రాకుండా వ్యాక్సిన్ ఉంది.
గర్భాశయ క్యాన్సర్
హ్యూమన్ ప్యాపిలోమా వైరస్‌తో గర్భాశయ క్యాన్సర్‌లు వస్తుంటాయి. మగవాళ్ళకి వార్ట్స్ వస్తుంటాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌తో వీటిని అరికట్టవచ్చు. హెచ్‌పివి వ్యాక్సిన్ కాన్సర్‌లో కూడా ఉపయోగపడుతుంది.
జ్యోష్టర్ వ్యాక్సిన్
హెర్పిస్ తగ్గడానికి ఈ వాక్సిన్‌ని వాడతారు. పోస్టర్ పెటిక్ న్యూరాజియా తీవ్రతని, నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడానికి, జ్యోష్టర్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది.
వ్యారిసెల్లా వాక్సిన్
చికెన్‌పాక్స్ రాకుండా ఇది తోడ్పడుతుంది.
రుబెల్లా వ్యాక్సిన్ - మీజిల్స్ - మమ్స్‌కి
2005 నుంచి ఇది లభ్యమవుతోంది. పొంగు, తట్టులాంటి వాటినుంచి కాపాడటానికి ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుంది.
మెనింజోకోకిల్ వ్యాక్సిన్ (బ్రెయిన్ ఫీవర్)
మెనింజైటిస్, మెనిరిగో కోక్‌సేమియా, సెప్టిసీమియా, నెప్టిక్, అర్థరైటిస్, నిమోనియా లాంటివి తగ్గించడానికి ఈ వాక్సిన్ తోడ్పడుతుంది.