తెలంగాణ

స్నేక్‌గ్యాంగ్‌లో ఏడుగురికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో పలు అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌లో మొదటి ఏడుగురు నిందితులకు యావజ్జీవ జైలుశిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు ఖరారు చేసింది. 8వ నిందితుడికి 20 నెలల జైలుశిక్షను విధించారు. ఈ కేసులో మంగళవారం వాదనలు ముగిశాక బుధవారం నాడు న్యాయమూర్తి శిక్షలను ప్రకటించారు. పాములను చూపెట్టి భయపెడుతూ స్నేక్‌గ్యాంగ్ ముఠా సభ్యులు 37 మంది యువతులను బెదిరించి బంగారు నగలను దోచుకున్నారు. మొత్తం 9 మంది నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేయగా ఒక నిందితుడిని నిర్దోషిగా భావించి కోర్టు విడుదల చేసింది. సామూహిక అత్యాచారం చేసినట్లు రుజువులు లేనందున ముఠా సభ్యులపై ఆ సెక్షన్లను తొలగించి న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేశారు. తాము పేదవర్గాలకు చెందినవారమని, కుటుంబ నేపథ్యం చూసి తమను విడుదల చేయాలని నిందితులు చేసిన విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. నేరాలను బట్టి శిక్షలు వేశామని, ఇతర విషయాలేవీ పరిగణనలోకి రావని జడ్జి స్పష్టం చేశారు.