యువ

ఎంత చేరువో అంత దూరం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక మీడియానా మజాకా..!
మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. బంధాల్ని, అనుబంధాల్ని చివరికి ఆలుమగల అనురాగాన్ని కూడా తెంచేసే శక్తి ప్రపంచ వ్యాప్తంగా రాజ్యం చేస్తున్న సామాజిక మీడియాకు ఉంది.

అవును నిజమే..మనం సామాజిక మీడియా సమాచార సునామీలో కొట్టుకు పోతున్నాం. ఎంత కోల్పోతున్నామో తెలియనంతగా మనల్ని మనం నష్టాల కూపంలోకి నెట్టేసుకుంటున్నాం! సామాజిక మీడియానా మజాకా..!మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. బంధాల్ని, అనుబంధాల్ని చివరికి ఆలుమగల అనురాగాన్ని కూడా తెంచేసే శక్తి ప్రపంచ వ్యాప్తంగా రాజ్యం చేస్తున్న సామాజిక మీడియాకు ఉంది. పరిచయాలే అనుబంధాన్ని పెంచుతాయి. ఆత్మీయతను పెంపొదిస్తాయి. దూరంగా ఉన్నా, చేరువగా ఉన్నా..ఈ రకమైన బంధానికి చేటు ఉండేది కాదు. ఇప్పుడు పక్కింటి పిన్నిగారు కూడా ఇంటికొచ్చి పలుకరించరు. పెళ్లయినా, పేరంటమైనా వ్యక్తిగతంగా ఎదురుపడరు. అంతా ట్విటర్ సందేశాలే..వాట్సప్ మెసేజ్‌లే..ఇలా మనిషికి మనిషి ఎదురుపడనప్పుడు..తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ‘సామాజిక మీడియా’నే వారధి అయినప్పుడు ఇక బంధాలకు తావెక్కడుంటుంది. ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత ఎలా ఏర్పడుతుంది. ఒకప్పుడు ఎంత దూరమో..అంత చేరువనేవారు. ఇప్పుడు వాట్సప్ వంటి వాటి పుణ్యమా అని ఎంత చేరువో అంత దూరంగా పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల మనిషి జీవితం, జీవనం కొత్త పుంతలు తొక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ ప్రతి ఒక్కరి జీవన శైలి యాంత్రికంగా మారిపోయిందన్న వాస్తవాన్ని విస్మరించలేం. అంత దూరం ఎందుకులే..అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో..ఆ మేరకు మానవ సంబంధాలు తెగిపోయినట్టే. మెసేజ్ ఇస్తే క్షణాల్లో వెళ్లిపోతుంది..మనమే వెళ్లి పిలవాలనేముంది అన్న భావన కలిగిన మరు క్షణమే ఆయా వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం అధఃపాతాళానికి వెళ్లిపోయినట్టే. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య బంధం మాట ఎలా ఉన్నా..ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితాల్లోకి అడుగు పెట్టిన వారి మధ్య కూడా ఈ ‘సందేశాలు’ సందేహాలను, అనుమానాలనే నింపేస్తున్నాయి. భర్త ఎక్కడికెళ్లాడో..ఎక్కడున్నాడో తెలియని అయోమయం వీటి వల్ల ఏర్పడుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ఈ అనుమానం పెనుభూతంగా మారి ‘చిన్న సందేశాలు’ విభేదాల అగాథంగా మారిపోతున్నాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్టుగా సామాజిక మీడియాను కొత్త పుంతలు తొక్కిస్తున్న వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో కొందరు కొట్టుకు పోతూంటే..బంధాలను, అనుబంధాలనూ తెంచేసుకునేలా తమకు తామే తెలియనంతగా సన్నిహితులకు దూరమైపోతూంటే..ఇంకా వీటి బారిన పడిన వారిది సామాజిక కొత్త పోకడను చూసి ‘అయ్యో..’అంటూ నిట్టూర్చే పరిస్థితే. టెక్నాలజీని మనం శాసించాలే గానీ అది మనల్ని శాసించకూడదు. మానవత్వాన్ని, మానవీయ విలువల్ని అన్నింటికీ మించి వౌలికమైన, ప్రాథమికమైన వ్యక్తిగత విలువల్ని హరించేయ కూడదు!

-బి.సుధ