జాతీయ వార్తలు

పరువు తీసిన సొంత పత్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియా ఫాదర్ ఫాసిస్ట్ సోల్జర్
ప్రధాని పదవికి ఆమె ప్రయత్నించారు
పార్టీలో 62 రోజుల్లో ఎదిగిన అధినేత్రి
కాంగ్రెస్ దర్శన్‌లో సంచలన వ్యాసాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తండ్రి స్ట్ఫోనో మయినో నియంతృత్వ సైనికుడు ( ఫాసిస్టుసోల్జర్). సోనియా పార్టీ సభ్యత్వం తీసుకున్న 62 రోజులకే అధ్యక్ష పదవి చేపట్టారు. ప్రధాని పదవి చేపట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చైనా, నేపాల్, జమ్ముకాశ్మీర్ విషయంలో తప్పుడు విధానాలు అవలంభించారు... ఇలా ప్రతిపక్షం విమర్శిస్తే పట్టించుకోవాల్సిన పనుండదు. కానీ, పార్టీ సొంత పత్రికలోనే ఇలాంటి రాతలు అచ్చయితే? ఇప్పుడిదే కాంగ్రెస్‌కు మంటపెట్టింది. కాంగ్రెస్ 131 స్థాపనదినోత్సవం సందర్భంగా మహారాష్టల్రోని పార్టీ హిందీ పత్రిక కాంగ్రెస్ దర్శన్ ప్రత్యేక సంచిక విడుదలచేసింది. సంచికలో రచయిత పేరు లేకుండా ప్రచురించిన రెండు వ్యాసాల్లో సోనియా, ఆమె తండ్రి స్ట్ఫానో మయినో, జవహర్‌లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాసాలపై సోనియా, రాహుల్ తీవ్రంగా మండిపడినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎడిటర్‌ను తొలగించి, వ్యాసాలపై దర్యాప్తునకు ఆదేశించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ దర్శన్‌లో వచ్చిన రెండు వ్యాసాలపై పత్రిక ఎడిటర్, ఎంపీ సంజయ్ నిరుపం విస్మయం వ్యక్తం చేస్తే, బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ అవి నూటికి నూరుశాతం అని విమర్శించారు. దర్శన్ పత్రికలోని మొదటి వ్యాసంలో సోనియా తండ్రి ఇటలీకి చెందిన నియంతృత్వ పార్టీ సభ్యుడిగా పని చేయటంతోపాటు ప్రపంచ యుద్ధంలో ఇటలీ తరఫున రష్యాపై యుద్ధం చేశారని వ్యాసంలో పేర్కొన్నారు. సోనియా అత్యంత వేగంగా పార్టీలో పైకొచ్చారని, సభ్యత్వం తీసుకున్న 62 రోజులకే అధ్యక్ష పదవి చేపట్టారని వ్యాసంలో పొందుపర్చారు. వ్యాసంలో సోనియా ప్రారంభ జీవితానికి సంబంధించిన పలు అంశాల్లో భాగంగా ఆమె ఎయిర్ హోస్టెస్ కావాలని కలలుకన్నట్టు రాసుకొచ్చారు. ప్రధాని పదవి చేపట్టేందుకు ఆమె విశ్వప్రయత్నం చేసినట్టు వ్యాసంలో పేర్కొనటం గమనార్హం.
రచయిత పేరు పేర్కొనని రెండోవ్యాసంలో తొలి ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని పటేల్ మధ్య నెలకొన్న విభేదాలను ప్రస్తావించారు. చైనా, టిబెట్, కాశ్మీర్‌లో మనం దెబ్బతినటానికి ప్రధాన కారణం నెహ్రూ విదేశాంగ విధానాలేనని ప్రస్తావించారు. చైనాను నమ్మొద్దంటూ పటేల్ పదేపదే హెచ్చరించినా నెహ్రూ పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యం పర్యావసానం అందరికీ తెలిసిందేనని వ్యాసంలో దుయ్యబట్టటం కాంగ్రెస్ నేతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతర్జాతీయ అంశాలపై పటేల్ దూరదృష్టితో చేసిన సలహాలను ఖాతరు చేసివుంటే దేశానికి పలు సమస్యలు ఎదురయ్యేవి కాదని వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
పొరబాటు జరిగిందన్నది అంగీకరిస్తూనే, ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా వ్యాసాలపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఎడిటర్ సంజయ్ నిరుపం ప్రకటించారు. రెండు వ్యాసాల ప్రచురణకు బాధ్యులెవరనేది ఏఐసిసి విచారిస్తుందని సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. ఇదిలావుంటే, రెండు వ్యాసాలపై నివేదికను సోనియాకు సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్ర నేతలు అందచేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే కాంగ్రెస్ దర్శన్ కథనాలపై విలేకరులు ప్రశ్నలు గుప్పిస్తారనేది గ్రహించిన పార్టీ అధినాయకత్వం సోమవారం సాయంత్రం మామూలుగా జరిగే మీడియా సమవేశాన్ని రద్దు చేసుకుంది.